Pslv c 24 will be launched today

PSLV C 24 will be launched today, Indian Space Research Organization ISRO, ISRO Chairman Radhakrishnan, IRNSS 1B Satellite

PSLV C 24 will be launched today, Indian Space Research Organization ISRO, ISRO Chairman Radhakrishnan, IRNSS 1B Satellite

నింగిలోకి పోనున్న పిఎస్ఎల్ వి సి-24

Posted: 04/04/2014 08:45 AM IST
Pslv c 24 will be launched today

ఈ రోజు శ్రీహరి కోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి శాటిలైట్ లాంచ్ వెహికిల్ పిఎస్ఎల్ వి  సి-24 ఐఆర్ఎన్ఎస్ఎస్-1బి ని అంతరిక్షంలోకి తీసుకెళ్ళి వదిలిపెట్టటానికి సర్వసన్నాహాలు జరుగుతున్నాయి. 

ఈ రోజు సాయంత్రం 5.14 కి నింగిలోకి దూసుకెళ్ళబోతోంది లాంచ్ వెహికిల్.  అందుకు కౌంట్ డౌన్ బుధవారం ఉదయం నుంచే కొనసాగుతోంది.

ఆనవాయితీ ప్రకారం ఇండియన్ స్పేస్ రిసెర్చ ఆర్గనైజేషన్ చైర్మన్ రాధాకృష్ణన్ సూళ్ళూరుపేటలోని చెంగాళమ్మ ఆలయానికి వెళ్ళి అక్కడ ప్రత్యేక పూజలు చేయించారు. 

ఈసారి అంతరిక్షంలోకి తీసుకుపోతున్న శాటిలైట్ ఇండియన్ రీజినల్ నేవిగేషన్ శాటిలైట్ సిస్టమ్స్ (ఐఆర్ఎన్ఎస్ఎస్-1బి) పూర్తిగా భారతదేశంలో తయారు చేసినది.  దీనితో భారతదేశంలో వెహికిల్ ట్రాకింగ్ తో ఫ్లీట్ మేనేజ్ మెంట్, డిసాస్టర్ మేనేజ్ మెంట్ చెయ్యవచ్చు.  మొబైల్ ఫోన్ తో అనుసంధానం చెయ్యటం ద్వారా ప్రిసైజ్ టైమింగ్, మాపింగ్ లాంటి ఉపయోగాలతో నేవిగేటర్లు, డ్రైవర్లు, ప్రయాణీకులు, వేరే వాళ్ళ దగ్గర లిఫ్ట్ తీసుకుని ప్రయాణిస్తున్నవారు ఇలా ఎంతో మంది కావలసిన డేటాను సంగ్రహించి ప్రయోజనాన్ని పొందవచ్చు. 

ఈ శాటిలైట్ రెండు రకాల సేవలను చేస్తుంది.  ఒకటి స్టాండర్డ్ పొజిషనింగ్ సర్వీస్ (ఎస్ పి ఎస్).  ఇది అందరికీ అందుబాటులో ఉంటుంది.  ఇక రెండవది రిస్ట్రిక్టెడ్ సర్వీసెస్ (ఆర్ఎస్)- ఎన్క్రిప్ట్ చెయ్యబడి కొందరు మాత్రమే తీసుకోగలిగే సేవ.  దీనికి ముందుగానే అంతరిక్షంలో ప్రవేశపెట్టిన 1 ఏ శాటిలైట్ ఇప్పటికే సేవలందిస్తోంది. 

ఐఆర్ఎన్ఎస్ఎస్-1బి జీవితకాలం 10 సంవత్సరాలు.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles