హేమంత్ పాటిల్ అనే వ్యక్తి అమితాభ్ బచ్చన్, సంబంధిత వ్యక్తుల మీద మూఢ నమ్మకాలను ప్రచారం చేస్తున్నారని, వాళ్ళమీద పోలీసులు చర్యలు తీసుకోవాలని మేజిస్ట్రేట్ కోర్ట్ లో కేసు వేసారు. బాంద్రా సబర్బన్ పోలీసు స్టేషన్లో తన ఫిర్యాదును తీసుకోకపోవటంa వలన కోర్టులో కేసు పెట్టవలసివచ్చిందని పాటిల్ అన్నారు. ఏప్రిల్ 18 న దీనిమీద విచారణకు మేజిస్ట్రేట్ సమయాన్ని కేటాయించారు.
భూతనాథ్ సినిమాలో మరణించిన తర్వాత సంచరిస్తున్న ఆత్మగా నటించిన తర్వాత అమితాభ్ మరోసారి దాని సీక్వెల్ భూత్ నాథ్ రిటర్న్స్ సినిమాలో నటిస్తున్నారు. అదే పాత్రను ఉపయోగిస్తూ ఒక హెల్త్ డ్రింక్ టివి వాణిజ్య ప్రకటనలో చూపిస్తున్నది మూఢ నమ్మకాలను బలపరిచేదిగా ఉందని, అందువలన మహారాష్ట్ర ప్రివెన్షన్ అండ్ ఇరాడికేషన్ ఆఫ్ హ్యూమన్ శాక్రిఫైస్ అండ్ అదర్ ఇన్ హ్యూమన్, ఈవిల్ ల్ అఘోరీ ప్రాక్టీసెస్ అండ్ బ్లాక్ మ్యాజిక్ చట్టం 2013 కింద నేరంగా పరిగణించాలని హేమంత్ పాటిల్ కోర్టుని అభ్యర్థిస్తున్నారు.
ఆ వ్యాపార ప్రకటనలో, దయ్యాలున్నాయన్న నమ్మకాన్ని, వాటిని తరిమికొట్టటానికి బ్లాక్ మ్యాజిక్ ని ఉపయోగించాలన్న విషయాన్ని ప్రధానంగా చూపిస్తున్నారని, ఆ 45 సెకండ్ల ప్రకటనకు ముందు గాని తర్వాత కాని డిస్ క్లైమర్ కూడా ఏమీ చూపించటం లేదని పాటిల్ అడ్వకేట్ వాజిద్ పఠాన్ అన్నారు.
చిన్న పిల్లలు తాగ్ కాంప్లాన్ హెల్త్ డ్రింక్ వాణిజ్య ప్రకటన అది.
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more