Tdp srikakulam prajagarjana

TDP Srikakulam Prajagarjana, Telugu Desam Party, Chandrababu Naidu, State bifurcation, Telugu self pride, Chandrababu assures auto drivers

TDP Srikakulam Prajagarjana, Telugu Desam Party, Chandrababu Naidu

నాలో కసివుంది మీలో ఉందా?

Posted: 03/27/2014 07:56 AM IST
Tdp srikakulam prajagarjana

శ్రీకాకుళం ప్రజాగర్జన కార్యక్రమంలో ప్రసంగించిన తెలుగు దేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు రెండు సార్లు కేంద్రంలోను రాష్ట్రంలోనూ కాంగ్రెస్ పార్టీకి ఊపిరి పోసిన తెలుగు రాష్ట్రానికి ఆ పార్టీ చేసిన ప్రత్యుపకారం రాష్ట్రాన్ని నిలువుగా చీల్చటమేనని, అందుకు తనలో ఆవేదనతో కూడిన కసి ఉందని, కాంగ్రెస్, వైయస్ ఆర్ కాంగ్రెస్ పార్టీలకు ధరావతు కూడా దక్కకుండా చెయ్యాలని కోరుతూ మీలో ఆ కసి వుందా అని అడిగారు.  అందుకు ప్రతిగా ఉంది అని సభలోంచి సమాధానం వచ్చింది.

ఉద్వేగ భరితంగా చంద్రబాబు మాట్లాడిన ప్రజాగర్జనలో శ్రీకాకుళం ప్రజ అసంఖ్యాకంగా విచ్చేసారు.  శాసనసభలో సంఖ్యాబలం లేకపోవటం వలనే రాష్ట్ర విభజనను ఆపలేకపోయానని, రాష్ట్రాన్ని ముక్కలు చేస్తుంటే కనీసం సమన్యాయం చెయ్యమని కోరినా ఫలితం లేకపోయిందని సభలో అన్నారాయన. 

దీన్ని ఎన్నికల సమయం  కాదు సంకుల సమరమని, తెలుగువాడి ఆత్మగౌరవం కోసం చేసే పోరాటమని అన్నారు చంద్రబాబు.  జాతీయ స్థాయిలో అందరితోనూ సంప్రదించటం అయిపోయిందని, ఇక ఎవరినీ ఏమీ అడుక్కోనక్కర్లేదని, ఆత్మగౌరవంతో బ్రతుకుదామని పిలుపునిచ్చిన చంద్రబాబు తెదేపాకు అధికారం రాగానే మహిళల రక్షణకు పసుపు దళం ఏర్పాటు చేస్తామని అన్నారు. 

చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలలో ఆటో డ్రైవర్లకు ఇంటి దగ్గరకే వచ్చి లైసెన్స్ ఇచ్చే పద్ధతిని ఏర్పాటు చేస్తానని, ఆటో డ్రైవర్లకు ప్రమాదం సంభవిస్తే 5 లక్షల రూపాయల పరిహారం, ప్రతి పట్టణంలో ఆటోనగర్, వాళ్ళకి ఉచితంగా ఇళ్ళు కూడా ఉన్నాయి.  దానితో పాటు ఆటో డ్రైవర్ల పిల్లలకు ఉచితంగా విద్యను సమకూరుస్తామని అన్నారు చంద్రబాబు.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles