Malaysian news papers mourned with black front pages

Malaysian news papers mourned with black front pages, Malaysian flight MH 370, MH 370 submerged in South Indian Ocean, Black backgrounds in twitter facebook accounts, News papers tribute with black background

Malaysian news papers mourned with black front pages

నల్లరంగుతో సంతాపం తెలిపిన మలేషియన్ వార్తా పత్రికలు

Posted: 03/25/2014 10:37 AM IST
Malaysian news papers mourned with black front pages

ఈ రోజు మలేషియాలోని వార్తాపత్రికలన్నీ సంతాపచిహ్నంగా నల్లరంగుని పులిమి సముద్రంలో కూలిపోయిన పౌర విమానం ఎమ్ హెచ్ 370 లో అసువులు బాసిన 239 మందికి నివాళులర్పించారు. 

మలేషియాలోని అత్యధిక సర్క్యులేషన్ లో ఉన్న ఇంగ్లీష్ దిన పత్రిక ది స్టార్ కవర్ నాలుగు వైపులా నల్ల రంగు, దాని మీద ఎమ్ హెచ్ 370 ఆర్ ఐ పి అని, చిన్న అక్షరాలలలో చనిపోయిన వాళ్ళ పేర్లను ముద్రించారు. ది న్యూ స్ట్రైట్స్ టైమ్స్ దిన పత్రిక నల్లరంగు ఫ్రంట్ పేజ్ మీద విమానం దాని కింద గుడ్ నైట్ ఎమ్ హెచ్ 370 అని ముద్రించారు.  మార్చి 8న ప్రమాదానికి గురైన విమానం సమాచార వ్యవస్థ తెగిపోక ముందు కాక్ పిట్ నుంచి రికార్డ్ అయిన ఆఖరు మాటలు ఆల్ రైట్ గుడ్ నైట్ అనే మాటలను అవి గుర్తుచేస్తున్నాయి.  ది స్టార్ పత్రిక సంపాదకీయంలో, సుదీర్ఘమైన నిరీక్షణకు ఫలితం ఈ రూపంలో వచ్చింది అంటూ రాసింది. 

మలయ్ చైనీస్ భాషల్లోని దిన పత్రికలు కూడా నలుపు రంగు బ్యాక్ గ్రౌండ్ లో ఫ్రంట్ పేజ్ ని ముద్రించాయి.  సోషల్ నెట్ వర్క్ లో కూడా ట్విట్టర్, ఫేస్ బుక్ లలో చాలామంది మలేషియన్లు నల్ల రంగు బ్యాక్ గ్రౌండ్ తో మృతి చెందినవారికి నివాళులర్పించారు. 

మలేషియా అంతా చనిపోయిన వారి కోసం అలా మౌనంగా రోదించింది.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles