Tdp bjp could not come to an agreement

TDP and BJP could not come to an agreement, BJP leader Javadekar, BJP TDP alliance, Pawan Kalyan Janasena, Loksatta party

TDP and BJP could not come to an agreement

తెదేపా భాజపాల మధ్య కుదరని సయోధ్య!

Posted: 03/24/2014 07:52 AM IST
Tdp bjp could not come to an agreement

రాజకీయ పార్టీలు ఎన్నికల తరుణంలో పొత్తుల ద్వారా ఉభయ వర్గాలకూ ప్రయోజనం కలిగే విధంగా ఒప్పందానికి రావటం మామూలే.  దీనివలన అనవసరమైన పోటీ, ఓట్ల చీలిపోవటం లాంటివి జరగకుండా ఉంటాయి, అధికారం చేజిక్కించుకునే అవకాశమూ ఉంటుంది.  ఒప్పందం కుదిరిందా సరే లేదంటే ఎవరి దారి వారిది ఎలాగూ ఉండనే ఉంది. 

ఆదివారం తెదేపా భాజపాల మధ్య సీట్ల అడ్జస్ట్ మెంట్ విషయంలో ఒక ఒప్పందానికి రాలేకపోయారు.  తెలుగుదేశం పార్టీ మేము అడుగుతున్న సీట్లను ఇవ్వటానికి తయారు లేదు, మా వాళ్ళేమో తమ పట్టుని విడవటం లేదు అంటూ భాజపా సీనియర్ నాయకుడు ఒకరు చెప్పుకొచ్చారు. 

ఈ చర్చల్లో భాజపా రాష్ట్ర వ్యవహారాల ఇన్ ఛార్జ్ ప్రకాశ్ జవదేకర్ భాగం వహించారు.  అయితే ఆయన చర్చలలోని వివరాలను బహిర్గతం చెయ్యటానికి నిరాకరించారు.  ఇవన్నీ చర్చలే.  అసలు నిర్ణయమంతా జాతీయ నాయకుల దగ్గర్నుంచి వస్తుంది.  స్థానిక నాయకులకు ఇందులో ఎటువంటి నిర్ణయాధికారమూ లేదు.  పొత్తు రాష్ట్రంలోనేనైనా జాతీయ రాజకీయాల దృష్ట్యా భాజపా నిర్ణయం తీసుకుంటుంది.  మోదీకి వచ్చిన ప్రాచుర్యం, నాలుగు రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికలలో భాజపా ప్రభంజనం, సర్వే నివేదికల దృష్ట్యా, భాజపా తమ గెలుపు మీద పూర్తి నమ్మకంతో ఉంది.  కనీసం చర్చల్లో ఆ విషయాన్ని స్పష్టం చేస్తున్నట్లుగా కనిపిస్తోంది. 

తెదేపా, లోక్ సత్తా, పవన్ కళ్యాణ్ పెట్టిన జనసేన పార్టీలతో కలిసి భాజపాకి రాష్ట్రంలోనూ పార్లమెంట్ సీట్ల ద్వారా జాతీయ స్థాయిలోనూ అధికారాన్ని చేపట్టే ఆలోచన ఉన్నా, చర్చల్లో మాత్రం గట్టి పట్టు పడుతున్నారు.  అందుకు కారణం చర్చలు చేసేవారికి నిర్ణయాధికారం లేకపోవటమే.  దూతలలా వచ్చినవారు మంచి బేరం ఆడగలిగితే వాళ్ళకి అధినాయకత్వం నుంచి ప్రయాజకులన్న గౌరవం దక్కుతుంది.   ఈ సంగతి తెలుసు కనుక తెదేపా కూడా లొంగటం లేదు.

అయితే, మరోసారి జరిపే చర్చల్లో ఇరు పార్టీలకూ ప్రయోజనం కలిగే విధంగా నిర్ణయాలు తీసుకుని, కొద్దిగా పట్టూ విడుపులతో ఒక ఒప్పందానికి వచ్చే అవకాశం ఉందని తెదేపా నాయకులంటున్నారు. 

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles