Maneka gandhi criticizes sonia gandhi

Maneka Gandhi criticizes Sonia Gandhi, Sonia 6th richest woman, BJP candidate Maneka Gandhi, Rahul Gandhi, Rajiv Gandhi, Varun Gandhi, Socia Gandhi

Maneka Gandhi criticizes Sonia Gandhi

కొడుకు తప్పుకున్నా తోటికోడలు వదల్లేదు

Posted: 03/22/2014 02:19 PM IST
Maneka gandhi criticizes sonia gandhi

రాహుల్ గాంధీకి వ్యతిరేకంగా ఎన్నికలలో మాట్లాడబోనని సంజయ్ మేనకా గాంధీల కుమారుడు వరుణ్ గాంధీ ప్రకటించి రెండు రోజులైనా కాలేదు, మేనకా గాంధీ తన నామినేషన్ ని దాఖలు చేస్తున్న సమయంలో తోటికోడలు సోనియాగాంధీ మీద తీవ్రస్థాయిలో అవినీతి ఆరోపణలు చేసారు. 

భారతీయ జనతా పార్టీ తరఫున నామినేషన్ ఫైల్ చేసిన మేనకా గాంధీ ఈ సారి పిలిభిట్ పార్ల మెంట్ నియోజకవర్గాన్ని ఎన్నుకున్నారు.  నామినేషన్ కి ముందు సోనియా గాంధీ గురించి మాట్లాడుతూ, ఆమె పెళ్ళిలో వరకట్నమేమీ తీసుకురాలేదు.  అలాంటప్పుడు ఆమె ప్రపంచంలో అత్యంత ధనిక మహిళల్లో ఆరో స్థానాన్ని ఎలా ఆక్రమించారని ప్రశ్నించారు.  కొంత కాలం క్రితం ఒక మేగజైన్ చేసిన సర్వేలో సోనియాగాంధీని ప్రపంచంలో అతి సంవన్న మహిళలలో ఆరవ స్థానంలో ఉన్నట్టుగా ప్రచురించారు. 

తోటికోడలు మీద అవినీతి ఆరోపణలు చేస్తూ, విదేశం నుంచి వచ్చిన ఆమెకు ఇక్కడ ప్రజలు ప్రేమను పంచటమే కాకుండా ధన సంపత్తిని కూడా ఇచ్చారు.  కానీ విదేశ పత్రికల సర్వే ప్రకారం ఆమె ప్రపంచంలోనే అతి సంపన్నుల జాబితాలో చేరిపోయింది.  ఇలా ఎలా సాధ్యమైంది అన్నారావిడ. 

ఆమెకు అక్కడి నుంచి రాలేదా డబ్బంతా ఇక్కడ మన సంపదలను, మన పిల్లలను భవిష్యత్తును కొల్లగొట్టారంటూ తీవ్ర స్థాయిలో ఆరోపించారు మేనక గాంధీ.  అందులో బ్రిటిష్ రాజ్ లో బ్రిటిషర్స్ ని కూడా మించిపోయారు ఈ పది సంవత్సారాల కాంగ్రెస్ పాలనలో అని కూడా అన్నారావిడ. 

అయితే పిలిభిట్ లో కాంగ్రెస్ నాయకుడు సంజయ్ కపూర్ మేనక గాంధీ మాటలను ఖండిస్తూ, వరకట్నం నిషేధించిన ఈ కాలంలో, దాన్ని చట్ట వ్యతిరేకంగా భావిస్తున్న కాలంలో కూడా మేనక గాంధీ కట్నం గురించి మాట్లాడటం బాగోలేదని, 300 మంది ఎంపీల మద్దతున్నా ప్రధాన మంత్రి పదవి తనకు వద్దని తిరస్కరించిన సోనియా గాంధీ గురించి మేనక గాంధీ అలా మాట్లాడటం తగదని అన్నారు.  అంతేకాదు, మేనక, వరుణ్ గాంధీలు హిందు ముస్లింల మధ్య విభేధాలను ఎప్పుడూ సృష్టించే ప్రయత్నంలోనే ఉంటారని కూడా ఆయన అభియోగాన్ని మోపారు. 

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles