Janasena bjp alliance changes telangana political scene

Janasena BJP alliance changes Telangana political scene, Pawan Kalyan Janasena party, Bharatiya Janata party, Narendra Modi, Telugu Desam party, TRS, Congress party

Janasena BJP alliance changes Telangana political scene

జనసేనతో తెలంగాణలో అంచనాలు తారుమారవుతాయా

Posted: 03/21/2014 12:42 PM IST
Janasena bjp alliance changes telangana political scene

పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన పార్టీకి ఎన్నికల కమిషన్ నుంచి ఇంతవరకు గుర్తింపు రాలేదు కానీ పొత్తులకు చర్చలు మాత్రం చోటుచేసుకుంటున్నాయి. 

ఊహించని రీతిలో రాజకీయ రంగప్రవేశం చేసిన పవన్ కళ్యాణ్ తను అధికారం కోసం రావటం లేదని, పదవులు వద్దని, కేవలం సేవా దృక్పథంతోనే రాజకీయాలలోకి వస్తున్నానని, అన్నిటికన్నా ముఖ్యంగా కాంగ్రెస్ నితరిమికొట్టటమే ధ్యేయమని ప్రకటించటంతో జాతీయ ప్రధాన ప్రతిపక్షమైన భారతీయ జనతా పార్టీతో చర్చలకు అవకాశం దొరికింది.  ఈరోజు అహ్మదాబాద్ లో భాజపా ప్రధాన మంత్రి అభ్యర్థి నరేంద్ర మోదీతో భేటీ అవుతున్న సందర్భంగా ఎన్నో ఊహాగానాలు వినవస్తున్నాయి. 

కానీ సాయంత్రానికల్లా వాటిమీద స్పష్టత వచ్చే అవకాశం ఉంది.  ముఖ్యంగా ఈ పొత్తులు తెలంగాణా లోని రాజకీయ ముఖచిత్రంలో మార్పు తెచ్చేట్టుగా ఉంది.  భారతీయ జనతా పార్టీతో కలిసి తెలంగాణాలో పోటీకి వచ్చినట్లయితే తెలంగాణా రాష్ట్ర సమితి, కాంగ్రెస్ పార్టీలకు కాస్ సమస్య తెచ్చిపెట్టటం అవుతుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

ప్రస్తుతం, తెలంగాణా ఉద్యమం వలనే వచ్చిందని, కాంగ్రెస్ భాజపాలు దొందూ దొందులే అన్నట్లుగా ప్రచారం చేస్తున్న తెరాస కు పవన్ కళ్యాణ్ జనసేన తెలంగాణాకు మద్దతుగా ఆవిర్భవించిన తీరు కాస్త కలతపెడుతున్నట్లుగానే ఉంది.  మోదీకి జాతీయ స్థాయిలో వచ్చిన పేరు ప్రఖ్యాతులతో పాటు పవన్ కళ్యాణ్ పవర్ కూడా జోడిస్తే, ఈ లోపులో తెదేపా కూడా భుజం కలిపితే భాజపాకు తెలంగాణాలో అధికారంలోకి వచ్చే అవకాశాలు బాగా పెరుగుతాయి. 

అలాగే సీమాంధ్రలో కూడా.  స్పష్టమైన వైఖరిని తెలియజేసిన పవన్ కళ్యాణ్ కాంగ్రెస్ తోనే కాకుండా తెలంగాణాలో తెరాసకు, సీమాంధ్రలో వైకాపాకు కూడా దూరంగా ఉంటారన్న విషయాన్ని అర్థమయ్యేట్టుగానే చెప్పారు తన పార్టీ ఆవిర్భావ సభలో.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles