Congress not afraid of modi says chidambaram

Congress not afraid of Modi says Chidambaram, BJP Prime Ministerial candidate Narendra Modi, Union Finance Minister Chidambaram

Congress not afraid of Modi says Chidambaram

మోదీ అంటే భయం లేదు అంటూనే కాంగ్రెస్ జాగ్రత్త చర్యలు

Posted: 03/19/2014 12:10 PM IST
Congress not afraid of modi says chidambaram

ఎన్నోసార్లు విజయం సాధించిన తన శివగంగ నియోజకవర్గం నుంచి మాట్లాడుతూ కేంద్ర ఆర్థిక మంత్రి చిదంబరం, దక్షిణ భారతంలో మోదీ అంటే ఎవరో ఎవరికీ తెలియదని, అందువలన భయమేమీ లేదని అన్నారు. 

భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోదీ వారణాసి నుంచి ఎన్నికలలో పోటీ చేస్తున్న సందర్భంగా అక్కడ దీటైన అభ్యర్థిని నిలబెడతామంటున్నారు చిదంబరం.  తనదైన వ్యంగ్య ధోరణిలో మోదీ వారణాసితో పాటు మరో నియోజకవర్గంలో కూడా పోటీ చెయ్యటానికి కారణం భాజపాలో అభ్యర్థుల కొరత ఉందేమో అని అన్నారు. 

సీనియర్ కాంగ్రెస్ నాయకులు పోటీకి వెనకాడుతున్నారు అన్న అరుణ్ జైట్లీ మాటలకు బదులు చెప్తూ, ఆయన తన 62 వ ఏట పోటీ చేస్తున్నారు కానీ నేను 30 సంవత్సరాలుగా ఎన్నికలలో పోటీ చేస్తూ వస్తున్నానని అన్నారాయన. 

ఎన్నికలలో మాటల యుద్ధం ఒక విధంగా మంచిదే.  అవతలివారికి వివరణనిచ్చే అవకాశం కలుగుతుంది.  అంతకంటే మరో పెద్ద ప్రయోజనం అన్ని పార్టీల గురించి, నాయకుల గురించి ప్రజలకు పూర్తి అవగాహన వచ్చేస్తుంది.  ఎవరి గొప్పలు వాళ్ళు చెప్పుకుంటుంటే వాళ్ళలోని లొసుగులను మరో పార్టీ నాయకులు బయటకు తీసుకునివస్తారు.  దానితో అందరు నాయకుల గురించి అందరికీ అర్థమౌతుంది.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles