State bifurcation is suicidal for congress says kiran kumar reddy

State bifurcation suicidal for congress says Kiran Kumar, Jai Samkyandhra party, Congress party, YSR Congress party, Telugu Desam party, Bharatiya Janata party

State bifurcation is suicidal for congress says Kiran Kumar Reddy

కాంగ్రెస్ కి విభజన ఆత్మహత్య సదృశం

Posted: 03/18/2014 08:18 AM IST
State bifurcation is suicidal for congress says kiran kumar reddy

తెలుగువారి మనోభీష్టాలను అర్థం చేసుకోకుండా రాష్ట్ర విభజనకు పూనుకున్న కాంగ్రెస్ కి అది ఆత్మహత్యా సదృశమే అయిందని ఉత్తరాంధ్ర పర్యటనలో ఉన్న జై సమైక్యాంధ్ర పార్టీ అధ్యక్షుడు కిరణ్ కుమార్ రెడ్డి విశాఖపట్నం వెంకోజీపాలెం లో సిఎమ్ఆర్ ఫంక్షన హాల్ లో జరిగిన సభలో మాట్లాడుతూ అన్నారు.  కాంగ్రెస్ చేసింది చారిత్రాత్మక తప్పిదమని, అందుకు మూల్యం చెల్లించుకోవలసి వస్తున్నదని అన్న కిరణ్ కుమార్ రెడ్డి, తెలంగాణా అప్పాయింటెడ్ డేట్ గా ప్రకటించిన జూన్ 2 లోపులోనే సుప్రీం కోర్టు నుంచి సమైక్యాంధ్రకు అనుకూలంగా తీర్పు వస్తుందన్న ఆశాభావాన్ని కూడా వ్యక్తపరచారు.   లోగడ ఎన్నోసార్లు తగిన సమయం కాదని తిరస్కరించినా, కేంద్ర ప్రభుత్వం చేసిన రాష్ట్ర విభజనను సవాల్ చేస్తూ కిరణ్ కుమార్ రెడ్డి సుప్రీం కోర్టులో వేసిన పిటిషన్ ని రాజ్యాంగ ధర్మాసనానికి పంపించింది సుప్రీం కోర్టు. 

కాంగ్రెస్ పార్టీతో పాటు కిరణ్ కుమార్ రెడ్డి రాష్ట్ర విభజన పాపాన్ని తెలుగు దేశం పార్టీ, వైయస్ ఆర్ కాంగ్రెస్ పార్టీలకు అంటగట్టారాయన.  ఆ రెండు పార్టీలూ విభజనకు సానుకూలంగా లేఖలు ఇవ్వబట్టే కాంగ్రెస్ పార్టీ ముందుకెళ్ళిందని ఆయన ఆరోపించారు. 

ఆ తర్వాత విజయనగరం జిల్లాలో, పలాస, కాశీబుగ్గ, శ్రీకాకుళం లో రోడ్ షోలలో పాల్గొన్న కిరణ్ కుమార్ రెడ్డి, ఆంధ్రా ఎంపీలను కొట్టి రాష్ట్రాన్ని విభజించారని అన్నారు.  ఐదు గంటల పాటు తాను రాష్ట్ర విభజన గురించి వచ్చే కష్టనష్టాలను తెలియజేసినా అధిష్టానం పట్టించుకోకుండా అసెంబ్లీలో తిరస్కరించిన బిల్లును పార్లమెంటులో ఆమోదిస్తూ, విభజనకు పూనుకుందని కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని తూలనాడారు.  అప్రజాస్వామ్య పద్ధతిలో వెళ్ళిన కేంద్ర ప్రభుత్వం తెలుగువారికి తీరని అన్యాయం చేసిందని అన్నారాయన. 

అందువలన విభజనకు పాటుబడ్డ కాంగ్రెస్, వైయస్ ఆర్ కాంగ్రెస్, తెదేపా, భాజపాలను తరిమికొట్టాలంటూ కిరణ్ కుమార్ పిలుపునిచ్చారు.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles