Telangana pcc to function from gandhi bhavan

Telangana PCC to function from Gandhi Bhavan, Indira Bhawan to APCC, Digvijay Singh, Rajendra Prasad, Sardar Vallabhai Patel

Telangana PCC to function from Gandhi Bhavan from Saturday, Indira Bhawan to APCC

గాంధీ భవన్ నేటి నుంచి తెలంగాణా పిసిసి కి

Posted: 03/15/2014 08:51 AM IST
Telangana pcc to function from gandhi bhavan

రాష్ట్రంలో పిసిసిలను విడదీసిన కాంగ్రెస్ పార్టీ రెండు కమిటీలకూ విడివిడిగా భవనాలు ఉండాలన్న ఉద్దేశ్యంతో పాత గాంధీ భవన్ ని తెలంగాణా పిసిసి కి కేటాయిస్తూ, అదే ప్రాంగణంలో కొత్తగా కట్టిన ఇందిరా భవన్ ని ఆంధ్రప్రదేశ్ పిసిసి కి కేటాయించింది.  ఈ రోజు నుంచి రెండు కమిటీలు తమ తమ భవనాలను ఉపయోగిస్తాయి. 

ఇందిరా భవన్ కొత్తగా ఆధునికంగా కట్టిన బహుళంతస్తుల భవనం.  ముందుగా ఈ భవనం తెలంగాణా పిసిసి కి కేటాయిద్దామనుకున్నారు.  కానీ తెలంగాణా సీనియర్ కాంగ్రెస్ నాయకులు అందుకు అభ్యంతరాలు తెలిపారు. 

గాంధీభవన్ 1950 లో కేంద్ర హోంమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ చేతుల మీదుగా శంఖుస్థాపన జరిగి, 1956 లో రాష్ట్రపతి రాజేంద్రప్రసాద్ చేత ప్రారంభించబడింది.  గాంధీ భవన్ ట్రస్ట్ చేత నిర్వహించబడుతున్న గాంధీభవన్ ని హైద్రాబాద్ స్టేట్ కాంగ్రెస్ ఉపయోగించటం మొదలుపెట్టింది.  1956 లో ఆంధ్రప్రదేశ్ ఏర్పడ్డప్పుడు హైద్రాబాద్ స్టేట్ కాంగ్రెస్ ఈ భవనాన్ని ఎపిసిసి కి అప్పగించింది.  అది ఇప్పుడు తిరిగి తెలంగాణా పిసిసి కి దక్కింది.

అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ప్రధాన సచివుడు దిగ్విజయ్ సింగ్ ఈ రోజు కొత్తగా ఏర్పడ్డ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీల ప్రారంభ సమావేశాలకు హాజరౌతారు.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles