Pawan kalyan speech in novotel

pawan kalyan speech in janasena party inaugration launching,pawan kalyan opinion on his film career after political entry,Pawan kalyan enteres novotel hotel to launch his party,Lotty charge on pawan kalyan fans at hitecs in hyderabad,tree house artchitected by japanese,pawan kalyan janasena party launching live streaming,pawan kalyan party live function photos,

Pawan kalyan speech in novotel, pawan kalyan speech in janasena party

గుండె నిండా ధైర్యం ఉంది-అన్నయ్య పై కోపం లేదు - పవన్

Posted: 03/14/2014 08:37 PM IST
Pawan kalyan speech in novotel

పవన్ కల్యాణ్ కొత్త పార్టీ ‘జన సేన’ సభా వేదిక వద్దకు కొద్దిసేపటి క్రితమే  చేరుకోవటం జరిగింది.  మెగా  అభిమానుల ఆనందోత్సాహాల పండుగ వాతావరణం నెలకొంది.  పవన్ కల్యాణ్ జనసేన పార్టీ ఆవిర్భావ సభ ప్రారంభమైంది.

హైదరాబాదులోని మాదాపూర్ నోవాటెల్ హోటల్లో జరుగుతున్న ఈ సభలో ప్రస్తుతం పవన్ కల్యాణ్ మాట్లాడుతూ  'అందరికీ హృదయ పూర్వక నమస్కారం' అంటూ మొదలెట్టిన పవర్ స్టార్ తనకు ఏమీ లేకున్నా గుండె నిండా ధైర్యం ఉందంటూ ఉద్వేగంతో వ్యాఖ్యానించారు.

అంతేగాకుండా, చిన్ననాటి నుంచి తనకు దేవరకొండ బాలగంగాధర్ తిలక్ కవితలంటే ఇష్టమని, కష్టాల్లో ఉన్నప్పుడు ఓ కవితను స్మరించుకుంటానంటూ, ఇల్లేమో దూరం.. అంటూ తిలక్ కవితను చదివి అభిమానులను ఉత్తేజపరిచారు. 

అయితే ఆ సమయంలో  తన పార్టీ ఆవిర్భావానికి కారణం ఢిల్లీ పెద్దల ముందు రాష్ట్ర నాయకుల బానిస బ్రతుకులే అని స్పష్టం చేశారు. అంతేతప్ప అన్నయ్య చిరంజీవికి వ్యతిరేకంగా కాదని వివరణ ఇచ్చారు. తన గుండెల్లో చిరంజీవికి ప్రత్యేక స్థానం ఉందని చెప్పారు.

ఆయనకు తానెందుకు ఎదురెళతానని పేర్కొన్నారు. సరిగ్గా ఐదేళ్ల క్రితం ప్రజారాజ్యం తరపున ప్రచారం చేసానని పవన్ కల్యాణ్ గుర్తు చేసుకున్నారు. రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశ్యం అప్పట్లో తనకి లేదన్నారు. తాను కోరుకుంటే అప్పుడే పీఆర్పీ తరపున ఎంపీగానో, ఎమ్మెల్యేగానో పోటీ చేసుండేవాడినని పవన్ చెప్పారు.

సమాజంలో జరిగే అన్యాయం, అక్రమాలు భరించలేక ఇప్పుడు కొత్త పార్టీ పెట్టానని ఆయన తేల్చి చెప్పారు. ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ లో కలిపినందుకు అన్నయ్య మీద కోపం లేదని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేప్పటం జరిగింది. 

 

-ఆర్ఎస్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles