Mega brother nagababu will supports chiranjeevi only

Nagababu, Mega brother Nagababu, Power star Pawan Kalyan, Chiranjeevi, Nagababu Supports Chiranjeevi, Nagababu Chiranjeevi.

Mega brother Nagababu Will Supports Chiranjeevi Only

నాగబాబు మెగా అన్నయ్యకే నా మద్దతు

Posted: 03/13/2014 08:34 PM IST
Mega brother nagababu will supports chiranjeevi only

మెగా బ్రదర్స్  గత కొన్ని రోజుల నుండి రాజకీయ విమర్శలు వినిపిస్తున్నాయి.  మెగా అన్నయ్య తమ్ముడు  పవన్ కళ్యాణ్  రాజకీయ అడుగు తీసుకోవటంతో  మెగా ఫ్యామిలీ  గురించి హాట్ హాట్  గా చర్చలు సాగుతున్నాయి.  

పవన్ కళ్యాణ్  రాజకీయ పార్టీ పెడుతున్న తరుణంలో..  మెగా కుటుంబం సభ్యులు  ఎలా స్పందిస్తారు అనే విషయం అందరు ఆశగా ఎదురుచూడటం జరిగింది. అయితే.. మొన్న మెగా అన్నయ్య చిరంజీవి తనయుడు రామ్ చరణ్ మాట్లాడుతూ.. తన మద్దతు తండ్రికే  అని చెప్పటం జరిగింది.  ఇక మిగిలింది నాగబాబు . 

ఈరోజు  నాగబాబు మాట్లాడుతూ..  పవన్ కళ్యాణ్ పార్టీ పై  క్లారిటీ గా చెప్పటం జరిగింది.  నాగబాబు  మద్దతు  మెగా అన్నయ్య  చిరంజీవికే  ఉంటుందని  స్పష్టం  చేయటం జరిగింది.  మెగా అబిమానులంతా  చిరంజీవి వెంటే ఉంటారని  నాగబాబు అన్నారు.  

అన్నయ్య చిరంజీవి  తమ అందరికీ  గొప్ప రాజమార్గం  ఏర్పాటు చేశారని , అందుకే  ఆయన అనుభవించిన కష్టనష్టాలు  తనకు తెలుసని నాగబాబు అన్నారు.  మెగా అన్నయ్య చిరంజీవి మార్గంలోనే తాను, పవన్, చరణ్ , బన్నీ అంతా  మంచి గుర్తింపు తెచ్చుకున్నామన్నారు. 

నాగబాబు  న్యాయమైన నిర్ణయం తీసుకున్నారని  మెగా అభిమానులు అంటున్నారు.  అదే పవన్ సపోర్టు చేసి ఉంటే  అన్నదమ్ముల బంధానికి విలువు లేకుండా ఉండేదని అంటున్నారు.  అయితే  నాగబాబు పవన్ కళ్యాన్ పార్టీ పై ఎలాంటి కామెంట్ చేయలేదు గానీ,   అన్నయ్యకు అండగా ఉంటానని  చెప్పటం జరిగింది.

అలాగే పవన్ కళ్యాణ్ న్ని  ఒంటరివాడ్ని చేయలేదు.  తన తమ్ముడు  ఎదుగుదలను  ఎప్పుడు కోరుకుంటానని పరోక్షంగా చెప్పటం జరిగింది. పవన్ పవర్ ఏమిటో  మెగా బ్రదర్స్ బాగా తెలుసు. అందుకే  పవన్ ను ఒంటరిగా వదిలిపెట్టిన.. వెయ్యి మంది బలం పుంజుకుంటాడనే విషయం అందరికి తెలుసు. పవన్ అసలే ముక్కు సూటి మనిషి. అందులోను ప్రజలు  మనిషి . అన్న బలంతో,  కొడుకు మద్దతు కోరుకునే   రకం పవన్  కాదని నాగబాబు కు బాగా తెలుసు.  

మొదటి నుంచి  నాగబాబు  మెగా అన్నయ్య మాటకు ఎదురుచెప్పిన దాఖాలు లేవు.  ఇప్పుడు కొత్తగా పవన్ కళ్యాణ్  కు  మద్దతు ఇచ్చి ,  మెగా అన్నయ్యను ఒంటరిని  చేయటం కంటే,  ఒంటరితనం  అలవాటు చేసుకున్న  పవన్ దూరంగా ఉండటమే మంచిదని  నాగబాబు బావించినట్లు తెలుస్తోంది.  

మెగా అన్నదమ్ములన్న తరువాత  అమాత్రం  పౌరుషం ఉండాలి మరీ.  చిరంజీవి, నాగబాబు , పవన్  ఎవరు వేరు  కాదు.. అందరు మెగా స్టార్సే అని మెగా అభిమానులు  అనుకుంటున్నారు.  ఏమైన కొత్తతనాన్ని అందరు ఆహ్వానించాలి.  

కోట్ల మంది అభిమానుల మనసును గెలుసుకున్న   పవర్  స్టార్  పవన్  కళ్యాణ్ కు..  ఇద్దర అన్నయ్య ల మనుసు  గెలుచుకోవటం పెద్ద కష్టమైన పనేం కాదు.  పరిస్థితుల ప్రభావం  వల్ల పది మందిలో  ఇలాంటివి  జరగటం  మాములే.  

అయినా  ప్రజలకు సేవా  చేయటానికి  సొంత ఫ్యామిలి మద్దతు అవసరం లేదు.  ప్రజలకు సేవా చేసే పవర్ మనసులో  ఉంటే చాలు. అధి పవన్ కళ్యాణ్ దగ్గర పుష్కాలంగా ఉందని .. నాగబాబు కు బాగా తెలుసు.  

రాజకీయంగా పరంగా కొంచెం ఎడబాటు  మెగా ఫ్యామిలీలో  ఏర్పాడిన..  కుటుంబం సభ్యులు మనసు నిండా పవనే  ఉన్నాడన్నాది ..జగమెరిగిన సత్యం.  అలాగే  పవన్ కళ్యాణ్  మనసు నిండా  ఆయన కుటుంబ సభ్యులే    ఉన్నారన్నది  పచ్చి నిజం. ‘‘ పవనిజం ఒక్కసారి  జపం చేస్తే చాలు.. వారి జీవితాంతం  చేస్తూనే ఉంటారు’’ థటీజ్  పవనిజం పవర్... 

-ఆర్ఎస్

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles