Bjp says its not modi but indira gandhi is hitler 2

BJP says its not Modi but Indira Gandhi is Hitler 2, Rahul Gandhi, Prakash Javadekar BJP, Narendra Modi, Bharatiya Janata party, Adolf Hitler

BJP says its not Modi but Indira Gandhi is Hitler 2

హిట్లర్ మోదీ కాదు మీ నానమ్మ- భాజపా స్పందన

Posted: 03/12/2014 02:26 PM IST
Bjp says its not modi but indira gandhi is hitler 2

అనటమెందుకు, అనిపించుకోవటమెందుకన్నట్లు, నాజీ నియంత అడాల్ఫ్ హిట్లర్ తో గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోదీ పోలుస్తూ రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలకు సూటిగా, వాడిగా, దీటుగా భాజపా సమాధానం చెప్పింది.

భారతీయ జనతా పార్టీ నాయకుడు ప్రకాశ్ జవదేకర్ మాట్లాడుతూ హిట్లర్ వారసులు ఎవరైనా మనదేశంలో పుట్టుంటే అది కేవలం కాంగ్రెస్ పార్టీలోనని అన్నారు.  హిట్లరనటం మోదీని అవమానవరచటమవుతుందని, మన దేశంలో ఎవరైనా హిట్లర్ లా ప్రవర్తించివుంటే అది కేవలం రాహుల్ నానమ్మ ఇందిరా గాంధీయేనని ఆయనన్నారు.   కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రమే హిట్లర్ లా ప్రవర్తిస్తోందని కూడా ఆయన అన్నారు. 

మంగళావారం గుజరాత్ మాట్లాడుతూ రాహుల్ గాంధీ మోదీని ఉద్దేశించి, అన్నీ తనకే తెలుసని, ప్రజలకు ఏమీ తెలియదని అనుకున్న హిట్లర్ లాంటి రెండవ హిట్లరని అన్నారు.  రైతుల భూమూలను కాజేసి పెద్ద పెద్ద సంస్థలకు ధారాదత్తం చేస్తున్నారని ఆయన అరోపించారు.  ఎంతసేపు నేనిది చేసాను, నేనది చేసానని అనటమే కానీ ప్రజల దగ్గరకు పోయి వాళ్ళ కేం కావాలన్నది చూడలేదని విమర్శించారు రాహుల్ గాంధీ.

గతంలో న్యాయశాఖా మంత్రి సల్మాన్ ఖురేషీ మోదీని నపుంసకుడనటం వివాదానికి దారితీసింది, అలా అనటం తప్పే అని కూడా రాహుల్ గాంధీ అన్నారు.  కానీ ఎన్నికలు దగ్గర పడుతుండటంతో ఇప్పుడు ఆయన కూడా ఎదుటివారిని కించపరచటం, తక్కువ చేయటం ద్వారా తన స్థాయిని పెంచుకోవటమనేది చేస్తున్నారు. 

అది న్యూటన్ కనుగొన్న సాపేక్ష సిద్ధాంతం లోకి వస్తుంది.  పెద్ద చిన్న అన్నది పోలికతోనే ఉంటుంది కాబట్టి ఎదుటి మనిషిని చిన్నగా చేస్తే తాను ఆ మనిషితో పోలికలో పెద్ద అవుతారన్నది రాజకీయాలలో సాపేక్ష సిద్ధాంతం.  కానీ ఈ ప్రక్రియలో దివంగతులైన నాయకులను కూడా బయటకు ఈడ్చటం, వారిమీద కూడా బురద చల్లించటం జరుగుతోంది.  రాహుల్ మాటల వలన చరిత్రను తవ్వి ఇందిరా గాంధీ ఎమర్జెన్సీ రోజులను గుర్తుకు చెయ్యటం జరిగింది అదీ ఆమె మనుమడి ద్వారా.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles