Idea launches ultra ii 3g phone

Idea launches Ultra II 3G phone, Idea Cellular company, What an idea sirji, Idea 3G phone costs 12500

Idea launches Ultra II 3G phone, what an idea sirji

వాటెన్ ఐడియా సర్ జీ

Posted: 03/12/2014 11:59 AM IST
Idea launches ultra ii 3g phone

కార్ల కంపెనీలకే పెట్రోల్ అమ్మే అధికారం ఉన్నట్లయితే కార్లను ఆ కంపెనీ ఉచితంగా ఇచ్చినా నష్టముండదు.  ఎందుకంటే పెట్రోల్ లేకుండా ఆ కార్లు నడవవు కాబట్టి, తప్పనిసరిగా వాళ్ళ దగ్గర పెట్రోల్ ని కొనాల్సివస్తుంది కాబట్టి.  కారు కొనేది ఒక్కసారే కానీ పెట్రోల్ మాత్రం జీవితాంతం కొనాల్సిందే. 

ఇది వ్యాపార సూత్రం.  ఈ సూత్రాన్ని వంటబట్టించుకుంటున్న టెలిఫోన్ కంపెనీలు ఈ కాలంలో బాగా ప్రచారంలో ఉన్న స్మార్ట్ ఫోన్ లను వాళ్ళ బ్రాండ్ నేమ్ తో ప్రవేశపెట్టటానికి చూస్తున్నాయి.  అందులో రిలయన్స్ అగ్రగామిగా నిలిస్తే ఇప్పుడు ఐడియా కూడా అదే పంథాలో పోతోంది. 

అందుకే 5.5 అంగుళాల స్క్రీన్ తో 3 జి ఫోన్ ని 8 మెగా పిక్సెల్స్ కేమెరాతో 2 మెగా పిక్సెల్స్ ఫ్రంట్ కేమెరాతో 4 జిబి ఇంటర్నల్ మెమొరీతో స్మార్ట్ ఫోన్ అల్ట్రా 2 ని రూ.12500 ధరకే ప్రవేశపెడుతోంది ఐడియా సెల్యూలార్ సంస్థ.  శ్యామ్సంగ్ ఫోన్లతో పోలిస్తే ఇది చాలా తక్కువ ధరే.  కానీ ఇంకా తక్కువకు కూడా ఐడియా ఇవ్వగలదు ఒకవేళ ఆ ఫోన్ ని ఐడియా సిమ్ తో మాత్రమే ఉపయోగించగలిగినట్లయితే. 

ఐడియా సంస్థ కి ఆంధ్రప్రదేశ్, కేరళ, మహారాష్ట్ర, గోవా, మధ్య ప్రదేశ్, ఛత్తీస్ గడ్, హర్యానా, తూర్పు పడమర ఉత్తర ప్రదేశ్ రాష్ట్రాలలో 3 జి మార్కెట్ ఉండటం వలన ఈ విధంగా స్మార్ట్ ఫోన్ ని మార్కెట్ లో ప్రవేశపెట్టగలిగితే వాళ్ళ కున్న 3జి లైసెన్స్ ఉపయోగించే వినియోగదారులు ఎక్కువౌతారు. 

ఐడియా దేశంలో టెలిఫోన్ సంస్థలలో మూడవ స్థానంలో ఉంది.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles