Aadhar unique number data threat

Aadhar unique number data threat, Infosys, Nandan Nilekani, Aadhar data of Indian citizens, Aadhar data held by US company, No data security guarantee on Aadhar

Aadhar unique number data threat, Infosys Nandan Nilekani

ఆధార్ జాతీయ భద్రతకు గొడ్డలిపెట్టు- బెంగళూరు ఎంపీ

Posted: 03/12/2014 10:31 AM IST
Aadhar unique number data threat

ఇన్ఫోసిస్ సహ సంస్థాపకుడు, ఆధార్ వ్యవస్థాపకుడు నందన్ నిలేకని ని కాంగ్రెస్ పార్టీ దక్షిణ బెంగళూరులో ఎన్నికలకు ఐదు సార్లు ఆ ప్రాంతం నుండి భారతీయ జనతా పార్టీ తరఫున ఎన్నికైన ఎంపీ అనంత కుమార్ కి పోటీగా నిలబెట్టింది. 

ఈ సందర్భంలో మాట్లాడుతూ అనంత కుమార్ ఆధార్ జాతీయ భద్రతకు ప్రమాదమని హెచ్చరించారు.  పౌరులు కానివారికి ఆధార్ నంబర్ ఇవ్వరు కేవలం పౌరులకే కేటాయించటం జరుగుతోంది.  ఈ విధంగా సేకరించిన భారతీయ పౌరుల వివరాలు అమెరికన్ కంపెనీ గుప్పిట్లో ఉండటం సరైనది కాదు.  ఎందుకంటే ఆ అమెరికా సంస్థ పాకిస్తాన్ కి కూడా సేవలందిస్తోంది అంటూ అనంత కుమార్ ఆరోపించారు. 

ఇన్ఫోసిస్ కంపెనీని స్థాపించిన ఏడుగురిలో నారాయణ మూర్తి ప్రధాన సంస్థాపకుడైతే మిగలినవారిలో నందన్ నీలేకని కూడా ఉన్నారు.  ఆయన ఆధార్ యునిక్ నంబర్ వ్యవస్థకు ప్రాణంపోసారు.  ఆ తర్వాత రాజకీయాలలోకి అడుగుపెట్టిన బెంగళూరువాసి నీలేకని ఈ సారి ఎన్నికలలో మొదటిసారిగా పోటీలోకి దిగుతున్నారు. 

ఆధార్ నంబర్ ని తప్పనిసరి చేస్తూ ప్రభుత్వ పథకాలతో సంబంధాన్ని పెట్టటాన్ని కోర్టులు అనేకమార్లు తప్పు పట్టాయి.  పథకాలతో ముడిపెట్టటం వలన ఆధార్ కి  ప్రాముఖ్యత పెరిగింది.  నమోదులు చకచకా జరిగిపోయాయి.  ఆంధ్రప్రదేశ్ అందులో ముందుందని మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ తన వెన్ను తనే పలుమార్లు చరుచుకున్నారు.  కానీ ఆధార్ నంబరు కోసం సేకరించిన డేటాకు భద్రత లేదు.  ప్రభుత్వం ఆ విషయంలో ఎప్పుడూ ఎటువంటి హామీనీ ఇవ్వలేదు.  విదేశీయులు కానీ, ఉగ్రవాదులు కానీ ఆ వివరాలను అందుకోలేరన్న గ్యారెంటీని ఎవరూ దేశవాసులకు ఇవ్వలేకపోయారు.  ఇప్పటికే సముద్రాలు దాటిన భారత పౌరుల వివరాలు దేశానికి ఎప్పుడు ఎలాంటి ముప్పును తెస్తుందో ఎవరూ చెప్పలేరు. 

ఈ విషయంలో ఆదుర్దా చూపించిన అనంత కుమార్ ఎన్నికల విషయంలో నందన్ నిలేకని వలన నష్టమేమైనా జరుగుతుందనుకుంటున్నారా అంటే, ఎంత మాత్రం లేదని, కాంగ్రెస్ అసలు తుడిచిపెట్టుకునే పోతోందని అన్నారాయన.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles