Tdp prajagarjan venue changed at vizag

TDP Prajagarjan venue changed at Vizag, Telugu Desam Party, TDP Prajagarjana at RK Beach changed, Prajagarjana changed to Municipal stadium

TDP Prajagarjan venue changed at Vizag, Telugu Desam Party

విశాఖలో తెదేపా ప్రజాగర్జనలో మార్పులు

Posted: 03/11/2014 03:41 PM IST
Tdp prajagarjan venue changed at vizag

తెలుగు దేశం పార్టీ బుధవారం విశాఖ పట్నం ఆర్ కే బీచ్ లో నిర్వహించదలచుకున్న ప్రజాగర్జనకు ఆదిలోనే హంసపాదు పడింది.  అందుకోసం ఎంతో ఘనంగా చేస్తున్న పనులు కాస్తా ఆగిపోయాయి. 

జిల్లా కార్యాలయం నుంచి అనుమతి తీసుకున్నా, విశ్రాంత ఐఏఎస్ అధికారి ఏఎస్ శర్మ బీచ్ లో సభను ఏర్పాటు చేస్తే పర్యావరణానికి హాని కలుగుతుందని చేసిన ఫిర్యాదును ఎన్నికల సంఘం ఆమోదించి తక్షణం పనులను నిలిపివేయవలసిందిగా కోరింది.  నాయకులు కలుగజేసుకుని జిల్లా యంత్రాంగంతో సంప్రదింపులు జరిపినా ప్రయోజనం లేకపోయింది. 

దానితో చేసేది లేక, ప్రత్యామ్నాయ ఏర్పాట్లకు సమయం లేక, ప్రజాగర్జన వేదికను పాత బస్తీలోని మున్సిపల్ స్టేడియంలోకి మార్చారు. 

ఈ రోజు ఉదయమే సంయుక్త కలెక్టర్ నరసింహారావు సభా నిర్వహణకు అనుమతి లేదని, అందువలన తక్షణమే ఏర్పాట్లను నిలిపివేయాలని ఆదేశించారు.  దానితో రేపటి లోగా మరోచోటికి మార్చటం కష్టమైన పన కాబట్టి తెదేపాలో గందరగోళ పరిస్థితి నెలకొంది. 

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles