Malaysian airlines miising plane still a mystery

Malaysian airlines missing plane still a mystery, MH 370 Malaysian airlines, Search on for missing Malaysian airlines

Malaysian airlines missing plane still a mystery

విమానం అదృశ్యం విచిత్రం

Posted: 03/10/2014 02:39 PM IST
Malaysian airlines miising plane still a mystery

మలేషియా పౌర విమాన శాఖాధికారి అజారుద్దీన్ అబ్దుల్ రహమాన్, 239 మందితో గాలిలో ఎగురుతున్న విమానం ఆచూకీ తెలియకుండా అదృశ్యమవటం చాలా చిత్రంగా ఉందని, ఇంతవరకు ఎప్పుడూ ఇలా జరగలేదని అన్నారు. 

వియత్నాం సమీపంలో సముద్రంలో తేలుతున్న పసుపుపచ్చని శకలాలేమిటో పరిశీలించటానికి మలేషియా ఓడలను పంపిస్తోంది. 

మలేషియన్ ఎయిర్ లైన్స్ రాడార్ లకు దొరకకుండా పోయి మూడు రోజులవుతోంది.  కానీ దాని ఆచూకీ ఎంతమాత్రమూ తెలియలేదు.  అందులో ప్రయాణం చేస్తున్న ప్రయాణీకుల బంధువులకు ఇక వారి మీద ఆశ వదులుకోమనే సంకేతాలను కూడా మలేషియా ఇచ్చింది. 

మలేషియన్ సైనిక ప్రధానాధికారి ఈ రోజు మీడియాలో మాట్లాడుతూ, గల్లంతైన ఎమ్ హెచ్ 370 కోసం గాలిస్తున్న చైనాతో కలిసి తాము కూడా ఆ విమానం అన్వేషణలో పడ్డామని, పోయిన పాస్ పోర్టులతో ప్రయాణం చేస్తున్నవాళ్ళగురించి కూడా ఆచూకీ తీసే ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు. 

సముద్రంలో ప్రతి చోటా ప్రతి క్షణమూ అన్వేషిస్తూనే ఉన్నామని, ఆచూకీ లభించేంత వరకూ అన్వేషణ కొనసాగుతుందని అజారుద్దీన్ అబ్దుల్ రెహ్మాన్ అన్నారు.  ప్రస్తుతం 40 షిప్ లు 34 విమానాలు గల్లంతైన విమానం ఆచూకీ కోసం గాలిస్తున్నాయి. 

మలేషియన్ రాజు అబ్దుల్ హలీమ్ గల్లంతైన విమానంలో ప్రయాణిస్తున్న ప్రయాణీకుల బంధువులకు తన సంతాపాన్ని తెలియజేసారు. 

ప్రపంచంలో వివిధ దేశాలకు 80 ప్రాంతాలకు ప్రతినిత్యం 37000 ప్రయాణీకులను చేర్చే మలేషియన్ ఎయిర్ లైన్స్ లో ఎక్కేవారి సంఖ్య ఈ రోజు గణనీయంగా పడిపోయింది. 

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles