Search is on for the missing malaysian flight

Search is on for the missing Malaysian flight, Malaysian Airlines MH 370 missing, Missing Malaysian flight highjacking not ruled out, USA FBI Boeing experts search, 13 countries in search of missing flight

Search is on for the missing Malaysian flight

ఆచూకీ ఇంకా తెలియని విమానం కోసం ముమ్మర గాలింపులు

Posted: 03/10/2014 07:47 AM IST
Search is on for the missing malaysian flight

శనివారం తెల్లవారు ఝామునుంచీ ఆచూకీ తెలియని మలేషియా వైమానిక సేవ ఎమ్ హెచ్ 370 కోసం ఇంకా గాలింపు చర్యలు జరుగుతూనేవున్నాయి.  13 దేశాలకు చెందిన 227 ప్రయాణీకులు, 12 మంది విమాన సిబ్బందితో శనివారం అర్ధరాత్రి కౌలాలంపూర్ నుంచి చైనాలోని బీజింగ్ చేరటం కోసం బయలుదేరిన బోయింగ్ 777-200 విమానం 6.30 కి గమ్యస్థానానికి చేరుకోవలసింది.  కానీ సమాచార వ్యవస్థ తెగిపోయి విమానం ఆచూకీ తెలియక దానికోసం గాలింపు చర్యలను చేపట్టవలసివచ్చింది. 

విమానాన్ని అపహరించారా అనే కోణంలో కూడా ఆలోచిస్తున్నారు అధికారులు.  దేన్నీ కొట్టిపారెయ్యలేం అంటున్నారు మలేషియా ఎయిర్ లైన్స్ ముఖ్య నిర్వాహణాధికారి అహ్మద్ జౌహారి యాహ్యా.  ఇటలీ, ఆస్ట్రియాకు చెందిన ఇద్దరు ప్రయాణీకులు పాస్ పోర్ట్ లు పోగొట్టుకోగా వాటిని ఉపయోగించి ఆచూకీ తెలియని ఆ విమానంలో మరో ఇద్దరు ప్రయాణించినట్లు తెలుస్తోంది.  కాబట్టి విమానం ప్రమాదంలో పడటమే కాకుండా అపహరణకు గురయ్యే అవకాశం కూడా ఉందని అధికారులు అంటున్నారు. 

విమానాల ఆచూకీ తీయటంలో అనుభవమున్న అమెరికాకు చెందిన సంస్థ గాలింపు చర్యలను చేపట్టగా మలేషియా ప్రభుత్వం మూడు యుద్ధ విమానాలతో వారికి సహాయంగా తిరుగుతున్నాయి.  సింగపూర్ రెండు యుద్ధ నౌకలను ఒక హెలికాప్టర్ ని పంపించింది.  చైనా రెండు యుద్ధ నౌకలను రంగంలోకి విమాన అన్వేషణలో పంపించింది.  అమెరికా ఎఫ్ బి ఐ, బోయింగ్ సంస్థలలో నిపుణులను రంగంలోకి దించింది. 

విమాన శకలాలు ఇంతవరకు ఎక్కడా దొరకలేదు.  అయితే వియత్నాం కి చెందిన ద్వీపం ధోచు సమీపంలో కొన్ని విమాన శకలాలు కనిపించినట్లుగా చేసిన వార్తలకు స్పందిస్తూ, మలేసియా విమానసేవల సంస్థ ఆ శకలాలు గల్లంతైన విమానంతో సరిపోలటం లేదని చెప్తోంది. 

మొత్తానికి విమానం గల్లంతు ఇంతవరకూ అంతు చిక్కకుండానే ఉంది.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles