One third of european women face violence

One third of European women face violence, Survey reveals violence on women, FRA survey reports violence on women, Women face vionence from 15, Physical assults on women, sexual assaults on women, Stalking, Cyber harassments

One third of European women face violence survey report reveals

యూరప్ లో మూడోవంతు మహిళలు వేధింపులకు గురౌతున్నారా?

Posted: 03/06/2014 12:22 PM IST
One third of european women face violence

యూరప్ లోని ప్రాథమిక హక్కుల ఏజెన్సీ (ఎఫ్ఆర్ఏ) చేసిన సర్వేలో మూడో వంతు మహిళలు హింసాత్మక చర్యలకు బలౌతున్నారని తేలి అందరినీ ఆశ్చర్యపరచింది.  15 సంవత్సరాల వయసు వచ్చిన దగ్గర్నుంచీ మూడోవంతు మహిళలు మగవాళ్ళ చేతిలో భౌతికంగా హింసను అనుభవిస్తున్నారని, మానసిక వేదనను అనుభవించేవారు 45 శాతం వరకు ఉన్నారని 42000 మహిళలతో ఇంటర్వ్యూ చేసిన ఆ సర్వేలో తేలింది. 

ఎఫ్ఆర్ఏ లో స్వాతంత్రం, న్యాయపరిరక్షణ శాఖకు నాయకత్వం వహిస్తున్న జోన్నా గూడీ బ్రుస్సెల్ లో ఉన్న యూరోపియన్ పార్లమెంట్ ఇంటర్ పార్లమెంటరీ కమిటీకి ఈ విషయంలో నివేదికను అందజేసారు. 

ఈ నివేదికను చూసిన తర్వాత సమాజంలో మహిళలమీద అత్యాచారం, హింసాకాండలు సమ్మతించగూడదని, ప్రతివారు తమ సొంత విషయంలా భావించకుండా అటువంటి సమాజాన్ని నిర్మించటంలో సహయోగం, భాగం వహించటం అవసరమని భావిస్తున్నారు.  ఈ  సర్వేని తేలిగ్గా తీసుకోగూడదని, యూరోపియన్ దేశాలలో మహిళల పట్ల జరుగుతున్న అకృత్యాలను అరికట్టటం అవసరమని ఎఫ్ఆర్ఏ భావిస్తోంది. 

మహిళలను ఇబ్బందికి గురిచేసే వాటిలో వాళ్ళు 15 సంవత్సరాల ప్రాయం నుంచే వాళ్ళని తేరిపార చూస్తూ అనుసరించటం, పనిచేసే ప్రదేశాలలో చేతులు తగిలించటం, హత్తుకోవటం, ఇమెయిల్స్ పంపించటం, అసభ్యకరమైన పోజుల్లో కనిపించటం ఉన్నాయి.  45 నుంచి 55 శాతం వరకు లైంగిక వేధింపులకు కూడా గురయినవారున్నారు.  20 శాతం మంది సైబర్ హెరాస్ మెంటు చేస్తున్నారని చెప్పారు.  సర్వే చేసినవారిలో 5 శాతం మంది వాళ్ళ 15 సంవత్సరాల వయసు నుంచే లైంగిక అత్యాచారాలకు గురౌతూ వస్తున్నామన్నారు.  14 శాతం మంది తమ జీవిత భాగస్వాముల నుండే హింసాత్మక దాడులు వస్తున్నాయని అంటున్నారు.

సర్వే నివేదికతోపాటుగా పోలీసులకు మహిళల మీద జరిగే హింసాకాండల విషయంలో తగిన అవగాహన, వాటిని నిరోధించటంలో శిక్షణ ఉండాలని, నేరస్తులను అదుపు చేయటానికి అవసరమైన అధికారాలను కూడా వాళ్ళకివ్వాలని సూచించటం జరిగింది.  ఇంటర్ నెట్, స్మార్ట్ ఫోన్ల ద్వారా జరిగే వేధింపులను అరికట్టటానికి నేరాలను అరికట్టే శాఖలకు తగిన సాంకేతిక అవగాహన కూడా ఉండాలని కూడా సలహా ఇవ్వటం జరిగింది. 

సర్వేలో తేలిన పూర్తి వివరాలను యూరప్ లోని దేశాల వారీగా ఇంటర్నెట్ లో అందుబాటులో ఉంచారు సర్వే నిర్వహించిన ఏజెన్సీ ఎఫ్ఆర్ఏ.

అయితే ఇది అంతటా ఉందిలే అని మనం మన దేశంలో మహిళలు ఎదుర్కుంటున్న వేధింపులను సమర్థించుకోవటం కాదు.  దీనికి తరుణోపాయమేమిటన్నది ఏ దేశమైనా ప్రపంచానికి సూచించవచ్చు.  దీన్ని గ్లోబల్ వార్మింగ్ డీఫారెస్టేషన్ లాంటి ప్రపంచం సమస్యగా గుర్తించి మేధావులంతా కూర్చుని పరిష్కరించవలసిన అవసరం ఉంది.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles