Police police

police police, A German returned experience, police personnel, police violation of rules, citizens violation of rules, traffic rules in India

police police, A German returned experience, police personnel, police violation of rules

పోలీస్ పోలీస్

Posted: 03/04/2014 04:47 PM IST
Police police

జర్మనీ వెళ్ళి వచ్చిన ఒక మిత్రుడి అనుభవం యథాతథంగా-

హైద్రాబాద్ లో అమీర్ పేట నుండి మోతీ నగర్ కి స్కూటర్ మీద వెళ్తున్నాడతను.  అతని దగ్గర డ్రైవింగ్ లైసెన్స్ కానీ స్కూటర్ కాగితాలు కానీ లేవు.  మధ్యలో చెయ్యూపి ఆపాడో పోలీస్.  భయపడుతూ ఆపాడతను కానీ ఆ పోలీస్ బండిని ఆపింది లిఫ్ట్ కోసం.  ఎటు పోతున్నవ్ అని అడిగాడా పోలీస్.  మోతి నగర్ అని సమాధానమిచ్చాడితను.  చెక్ పోస్ట్ నుంచి పోతవా అని అడిగినదానికి  ఆవునన్నాడతను.  సరే పద అని వెనక సీటు మీద ఎక్కికూర్చున్నాడు పోలీస్. 

మనవాడికి కాస్త ధైర్యమొచ్చింది.  కానీ మధ్యలో చెకింగ్ జరుగుతోంది.  ఏం చెయ్యాలి ఆపాలా అని అడిగితే, ఏం లైసెన్స్ లేదా అని అడిగాడు పోలీస్.  లేదన్నాడతను.  ఫరవలేదులే పోనీ నేనున్నాగా అని భరోసా ఇచ్చాడతను.  ఇతన్ని చూసి అక్కడి చెకింగ్ చేస్తున్నవాళ్ళు సెల్యూట్ చేసారు.  స్కూటర్ నిర్విఘ్నంగా ముందుకు సాగింది. చెక్ పోస్ట్ వచ్చింది. దిగాడు పోలీస్.  మోతీ నగర్ వెళ్ళాలి మధ్యలో ఎవరైనా పట్టుకుంటారేమో అంటూ నసిగాడు స్కూటర్ నడుపుతున్నతను.

ఏం పరవలే నా పేరు చెప్పు ఇదిగో చూడు నా పేరు జెపి నారాయణ అంటూ తన యూనిఫాం మీదున్న బిళ్ళను చూపించాడతను. 

సీన్ కట్ చేస్తే,

ఇదే మనిషి జర్మనీలో ఉద్యోగానికి పోయాడు.  పాస్ పోర్ట్ వీసాలను ఇంట్లో వదిలిపెట్టి బయటకు పోగా పోలీసులు తనిఖీలో లేవని, ఇంట్లో వదిలిపెట్టి వచ్చానని చెప్తూ, తన ఇంటి అడ్రస్ చెప్పాడతను తడుముకోకుండా.  కానీ అతన్ని పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టి పోలీసులే ఆ ఇంటి అడ్రస్ లో విచారణ చేసి అతను చెప్పింది నిజమేనని తెలుసుకుని అతని పాస్ పోర్ట్ వీసాలను తెప్పించి పరిశీలించి అతని చేతికిచ్చారు.  బ్రతుకు జీవుడా అని బయటకు పోతుంటే, ఆగమంటూ వాళ్ళు తమ వాహనంలో లిఫ్ట్ ఇవ్వటానికి తయారయ్యారు. 

మా వలన మీరు మూడు గంటలు పోలీస్ స్టేషన్లో గడిపారు.  కాబట్టి ఇది విధి మిమ్మల్ని మీ ఇంటికి చేరుస్తాం అని తీసుకెళ్ళారు.  దారిలో ట్రాఫిక్ సిగ్నల్ వచ్చింది.  రెడ్ లైట్ దగ్గర ఆగాడతను.  కానీ అటూ ఇటూ వాహనాలేమీ రావటం లేదు.  అయినా పూర్తిగా పచ్చరంగులోకి మారిన తర్వాతనే పోలీసు వాహనాన్ని ముందుకు తీసుకెళ్ళారు. 

మనవాడికి ఆశ్చర్యమేసింది.  అటూ ఇటూ వాహనాలేమి లేవు కదా పైగా మీద పోలీస్ వాహనం కదా, మా దేశంలోనైతే ఇంతసేపు ఆగం అన్నాడతను ఆ పోలీస్ అధికారితో. 

అతను నవ్వి, మేము కూడా మామూలుగా అయితే అటూ ఇటూ ఖాళీగా ఉన్నప్పుడు ఆగం కానీ ఇదిగో మీరున్నారని ఆగాం.  మీరు మీ దేశం వెళ్ళిన తర్వాత మా గురించి చెడుగా చెప్పగూడదుగా అందుకే అన్నాడు.  నివాసం దగ్గర వదిలిపెట్టిన తర్వాత బై చెప్పి వెళ్ళిపోయాడతను. 

సరే ఇక చాయ్ కి డబ్బులు అడగలేదని కూడా చెప్పటం వాళ్ళని దిగజార్చినట్లే అవుతుంది. 

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles