Nd tiwari accepts rohit shekhar as his son

ND Tiwari, Congress leader ND Tiwari, Rohit Shekhar, politician ND Tiwari, ND Tiwari accepts Rohit Shekhar as his son

ND Tiwari accepts Rohit Shekhar as his son

రాసలీలలఎన్టీ తివారీ పై గెలిచిన కొడుకు...

Posted: 03/03/2014 02:00 PM IST
Nd tiwari accepts rohit shekhar as his son

ఆంద్రప్రదేశ్ లో గవర్నర్ గా ఉండి, మలి వయస్సులోనూ రాసలీలు జరిపి ఆంధ్రప్రదేశ్ గవర్నర్ పదవి నుండి వైదొలిగిన ఎన్డీ తివారీ పితృత్వం కేసులో దిగొచ్చారు.  రోహిత్ శేఖర్ నా కుమారుడే అని తివారీ (89) ఒప్పుకున్నారు. తివారీ పితృత్వం కేసును ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే.  చాన్నాళ్లుగా శేఖర్ తన కుమారుడు కాదంటూ తివారీ వాదిస్తూ వచ్చిన సంగతి తెలిసిందే. అయితే శేఖర్ కోర్టును ఆశ్రయించి తివారీ తన తండ్రే అని పోరాటం చేశారు.

తండ్రి కొడుకుల మద్య పోరాటం ఇలా సాగింది... 

ఎన్డీ తివారీ.. మలి వయసులో ముదిరి రొమాన్స్ ఎంజాయ్ చేస్తున్న సమయంలో.. ఆయనకు అనుకోని సంఘటన ఎదురైంది. 89 ఏళ్ల తివారి పై 32 యువకుడు కేసు పెట్టాడు.  తివారి తొందరపాటు ప్రయోగంలో జరిగిన ఫలితమే ..ఈ 32 ఏళ్ల రోహిత్ శేఖర్.  తివారీ తన తండ్రే అంటూ 32 ఏళ్ల యువకుడు సాగించిన పోరాటంలో చివరగా విజేతగా నిలిచాడు. 

దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన రాష్ట్ర మాజీ గవర్నర్, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు నారాయణ్ దత్ తివారీ పితృత్వ కేసు సుఖాంతం అయ్యింది. 2008లో రోహిత్ శేఖర్ అనే వ్యక్తి తన తండ్రి తివారీ అంటూ కోర్టులో కేసు వేశాడు. అప్పటి నుండి తివారీ మాత్రం రోహిత్ కు తనకెలాంటి సంబంధం లేదంటూ చెబుతూ తప్పించుకుంటూ వస్తున్నాడు. 

రోహిత్ మాత్రం పట్టువదలని విక్రమార్కుడిలా పోరాటం చేస్తూ వచ్చారు. 2012 సంవత్సరంలో డిఎన్ఏ పరీక్షకు ఢిల్లీ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీనిపై తివారీ కూడా కోర్టు మెట్లు ఎక్కారు. రక్త నమూనాలు ఇవ్వనని తివారీ మొండికేశారు. చివరకు కోర్టు మొట్టికాయలు వేయడంతో రక్త నమూనాలు ఇచ్చారు. కానీ ఆ నివేదికను రహస్యంగా ఉంచాలంటూ తివారీ సుప్రీంకోర్టును అభ్యర్థించాడు. 

అక్కడ కూడా ఆయనకు చుక్కెదురైంది. తివారీ నుండి సేకరించిన రక్తనమూనా నివేదికను బట్టి రోహిత్ శేఖర్ తండ్రి తివారేనని తేలిపోయింది. చివరకు తన కుమారుడు రోహిత్ అని తివారీ ప్రకటించడంతో  తండ్రి కొడుకుల పోరాటానికి  తెరపడింది. దీంతో రోహిత్  శేఖర్ ఆనందంతో  న్యాయమే గెలిచిందని  తన సన్నిహితులతో చెబుతున్నారు. 

-ఆర్ఎస్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles