Seemandhra people sorry says nannapaneni rajakumari

nannapaneni rajakumari, nannapaneni, tdp, ap bifurcation, seemandhra people, telangana bill.

seemandhra people sorry says nannapaneni rajakumari

టిడిపి ఓడిపోయింది..క్షమించండి :నన్నపనేని

Posted: 02/27/2014 02:00 PM IST
Seemandhra people sorry says nannapaneni rajakumari

అవును మీరు చదివింది కరెక్టే.,  తెలుగుదేశం పార్టీ ఓడిపోయింది.. కాబట్టి  మమ్మల్ని  క్షమించండని.. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ  నన్నపనేని రాజకుమారి  అడుగుతుంది. ఏ విషయం లో  టిడిపి ఎందుకు  ఓడిపోయిందో మీకు తెలుసా? అని నన్నపనేని  రాజకుమారి అడుగతుంది.  టిడిపి  ఈ విషయంలో  ఘోరంగా ఓడిపోయిందని  ఆమె ఒప్పుకుంది. 

ఇంతకీ ఏ విషయంలో  అంటారా..  ఆంద్రప్రదేశ్ రాష్ట్రాన్ని  సమైక్యంగా  ఉంచేందుకు  తెలుగుదేశం పార్టీ నాయకులు చేసిన  సమైక్యాంద్ర పోరాటంలో  తెలుగుదేశం పార్టీ ఘోరంగా ఓడిపోయిందనే సీమాంద్ర ప్రజలకు బాగా తెలుసు.  ఇప్పుడు అదే  మాటలను.. మన గాజులక్క కొంచెం విడమరిచి, తన పార్టీకి సింపతి  పెరిగే విధంగా..  సీమాంద్ర ప్రజలారా  టిడిపిని క్షమించండిని మీడియా ముందు అడగటం జరిగింది. 

ఈ నేపథ్యంలో ఆ పార్టీ నాయకురాలిగా సీమాంధ్ర ప్రజలకు క్షమాపణలు చెబుతున్నట్లు ప్రకటించారు.  రాష్ట్ర విభజనపై కేంద్రం తీసుకున్న నిర్ణయంపై  న్యాయస్థానంలో తమ పోరాటాన్ని మాత్రం కొనసాగిస్తామన్నారు. రాష్ట్ర విభజన వద్దని తమ పార్టీ కొనసాగించిన పోరాటాన్ని ఆమె ఈ సందర్భంగా విశదీకరించారు.

 విభజన బిల్లు తప్పులు తడఖ అని అటు విధాన సభ, ఇటు విధాన మండలి రాష్ట్రపతికి తిప్పి పంపామని, అయిన  పార్లమెంట్ ఉభయ సభలలో ఆ బిల్లు ఆమోదం పొందిందని ఈ సందర్భంగా నన్నపనేని  కాంగ్రెస్ పార్టీ అనుసరించిన  వైఖరిపై నిప్పులు చెరిగారు.

నిజాన్ని నిర్భయంగా  చెప్పినందుకు  గాజులక్కను  సీమాంద్ర ప్రజలు అభినందాలి.  సమైక్యాంద్ర  కోసం .. చంద్రబాబు  ఏ రాజకీయ చేశాడో తెలియదు గానీ,  మన గాజులక్క మాత్రం , తనకన్నీళ్లతో సీమాంద్ర ప్రజల తరుపున పోరాటం చేసింది,  అసెంబ్లీ ఎక్కింది,  తెలంగాణ నేతల చేత నేట్టించుకుంది, శాసనసభలో.. రెండు రోజులు ధీక్ష చేసింది. ఇన్నీ చేసిన  గాజులక్కను..ఎవరు పట్టించుకోలేదు.  కాబట్టి  సీమాంద్ర ప్రజలారా మన తెలుగింటి  గాజులక్కను  క్షమించండి. 

 

-ఆర్ఎస్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles