ఎన్నికల నేపథ్యంలో, తెలంగాణా రాష్ట్ర ఏర్పాటుకు పార్లమెంటు ఉభయ సభలలో ఆమోదం లభించి వారం రోజులైనా ఇంకా జాప్యం జరుగుతుండటంతో సందిగ్ధ వాతావరణం నెలకొంటోంది. ఎన్నికలు రెండు రాష్ట్రాలలోనా లేకపోతే ఒకే ఉమ్మడి రాష్ట్రంలోనా, రాష్ట్రపతి పాలనా లేకపోతే మరో ముఖ్యమంత్రిని నియమించి ఆపద్ధర్మ ముఖ్యమంత్రిని రిలీవ్ చేస్తారా అన్నవి సర్వత్రా ఉత్కంఠను కలిగిస్తున్నాయి. ఇక ముఖ్యమంత్రి బరిలో ఉన్న నాయకుల మనసులో అలజడుల గురించి చెప్పుకోనక్కర్లేదు.
అయితే ఈ జాప్యాలకు కారణం తెలంగాణా రాష్ట్ర సమితి నిర్ణయంలో జాప్యమే కారణమని రాజకీయ రంగంలో చెవులు కొరుక్కుంటున్నారు. తెలంగాణా ఇస్తే విలీనం చేస్తామని చెప్తూ వచ్చిన తెరాస ఇంతవరకు అందులో స్పష్టమైన నిర్ణయాన్ని తెలియజేయలేదు. ఎన్నికలలో రాజకీయ పొత్తు పెట్టుకునే ఆలోచన కూడా ఉంది. ఏ పొత్తూ లేకుండానే తెలంగాణా రాష్ట్రంలో సంపూర్ణ మెజారిటీ సంపాదించవచ్చనే నమ్మకం కూడా తెరాసకి ఉంది. ఈ రోజు హైద్రాబాద్ లో జరుగుతున్న తెరాస విజయోత్సవం తర్వాత కాని పార్టీ వైఖరి ఎలా ఉంటుందో చెప్పలేం.
అయితే కాంగ్రెస్ నేతలు మాత్రం విలీనానికి కెసిఆర్ అనుకూల సంకేతాలిచ్చారనే చెప్తున్నారు. ఢిల్లీలో దిగ్విజయ్ సింగ్ మాట్లాడుతూ కెసిఆర్ సోనియా గాంధీ, రాహుల్ గాంధీలతో భేటీ అయినప్పుడు తెరాస ను కాంగ్రెస్ లో విలీనం చెయ్యటానికే మొగ్గు చూపించినట్లుగా ఆయన చెప్తున్నారు.
కాకతాళీయంగా కెసిఆర్ విమానం కూడా ఆలస్యంగా చేరుకుంటోంది. ఢిల్లీ నుంచి బయలుదేరి మధ్యాహ్నం 1.00 గంటకు హైద్రాబాద్ చేరుకోవలసిన కెసిఆర్ 2.00 గంటలకు విజయోత్సాహ ర్యాలీలో పాల్గొన్ని విజయరథం మీద గన్ పార్క్ కి వెళ్ళవలసిన షెడ్యూల్ 4.00 గంటలకు ప్రారంభమయ్యే అవకాశం కనిపిస్తోంది. విజయోత్సాహ ర్యాలీలో వచ్చిన స్పందన చూసిన తర్వాత పార్టీ నాయకులతో మాట్లాడిన తర్వాత కెసఆర్ కాంగ్రెస్ తో పొత్తు విలీనాల విషయంలో నిర్ణయం తీసుకోవచ్చు.
ఈ విషయంలో కాంగ్రెస్, తెరాసలు రెండూ ఆచితూచి అడుగులు వేస్తున్నట్టుగా కనపడుతోంది. తెలంగాణా ఆవిర్భావాన్ని కూడ ప్రకటించినట్లయితే ఇక కాంగ్రెస్ చేతిలో ఏమీ ఉండదు, కేంద్రం మెడలు వంచి తెలంగాణా తెచ్చానని కెసిఆర్ అనే అవకాశం ఉండదని ఢిల్లీ పెద్దలు జాగ్రత్తగా ఉన్నట్లుగా కనిపిస్తోంది. మరోపక్క మనకే ఆధిక్యత ఉన్నప్పుడు ఎన్నికల్లో పొత్తు కానీ, కాంగ్రెస్ లో విలీనం కానీ చేస్తే పార్టీకి ఏం ప్రయాజనం అన్నది కూడా తెరాస నాయకులు ఆలోచిస్తున్నట్టుగా కనబడుతోంది.
మా పని మేం చేసాం అని కాంగ్రెస్ చెప్పనే చెప్పింది. అందువలన జాప్యం మా వలన కాదు అన్న సంకేతాలను కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. ఎన్నికల లోపులో తెలంగాణా ఆవిర్భావ ప్రకటన జరగకపోతే ఎన్నికల కమిషన్ ఉమ్మడి రాష్ట్రంలోనే ఎన్నికలు జరుపుతుంది. అందుకు తెరాస కూడా భయపడవలసిన అవసరం లేదు.
కడుపుతో ఉన్నమ్మ కనక మానుతుందా అని, ఉభయ సభల్లో విభజన బిల్లు ఆమోదం పొందిన తర్వాత రాష్ట్రపతి ఆమోదం రాదా, మిగిలిన కార్యకలాపాలు జరగకుండా ఉంటాయా అన్న ధీమా కూడా తెరాస లో కనిపిస్తోంది.
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more