Jairam ramesh manhandles telangana mp vh

Jairam Ramesh, V Hanumant Rao, Telangana Bill, Jairam Ramesh manhandles Telangana MP VH, congress party, Congress Minister Jairam Ramesh.

Jairam Ramesh manhandles Telangana MP VH

నిజంగా వీహెచ్ పై జైరాం చేయిచేసుకున్నారా?

Posted: 02/24/2014 05:02 PM IST
Jairam ramesh manhandles telangana mp vh

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు రాజ్యసభ సభ్యుడు వి హనుమంతరావుప పై  ఒక ఫోటో సోషల్  మీడియాల్  హల్ చల్ చేస్తుంది. వి హనుమంతరావు పై  కేంద్ర మంత్రి జైరాం రమేశ్  చేయి చేసుకున్నట్లు  కనిపిస్తున్నఫోట్ ఇప్పుడు హల్ చల్ చేస్తుంది. 

దీంతో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు  ఆశ్చర్యం వ్యక్తం  చేస్తున్నారు.  హనుమంతరావు పై  జైరాం రమేశ్  చేయి చేసుకునే సందర్భంలో.. కేంద్ర మంత్రి జేడీ శీలం కూడా పక్కనే ఉన్నారు. ఈ ఫోట్ పై హనుమంతరావు అభిమానులు మండిపడుతున్నారు.  ఇది నిజమా? లేక ఫోటో మాయా అనే  తేల్చుకోలేపోతున్నారు. 

అదీ కూడా పార్లమెంట్  ఆవరణలో  జరిగినట్లు  హనుమంతరావు ముఖంపై చేయిపెట్టి తోస్తున్న జైరాం రమేశ్ ఫోటో ట్విటర్ తోపాటు ఫేస్ బుక్ లో కూడా చర్చనీయాంశమైంది. అయితే కాంగ్రెస్ పార్టీ సంస్కృతికి నిదర్శనం, జైరాం రమేశ్ ప్రవర్తనపై నెటిజన్లు మండిపడుతున్నారు.

కానీ జైరాం రమేశ్ సరదాగా హన్మన్నపై చేయివేశారా లేక ఏదో కారణంగా కోపంతో చేయిచేసుకున్నారా అనే విషయం బయటకు రాలేదు. అయితే  ఈ విషయం  జరిగి కొన్ని రోజులైనట్లు తెలుస్తోంది.   ఈ ఫోటో  ఆలస్యంగా  వెలుగులోకి  రావటంతో..  కాంగ్రెస్  పార్టీ లో పెద్ద దుమారం రేపుతుంది.  

ఈ విషయం తెలుసుకున్న తెలంగాణ కాంగ్రెస్ నాయకులు, తెలంగాణ కాంగ్రెస్ కార్యకర్తలు  తీవ్రస్తాయిలో మండిపడుతున్నారు. వి హనుమంతరావుపై జైరాం రమేశ్ చేయి చేసుకున్నారని @ జన్ లోక్ పాల్  అకౌంట్ ద్వారా ట్వీట్ చేసినట్లు  కాంగ్రెస్ కార్యకర్తలు  గుర్తించారు.  

ఈ ఫోటో  పై  హనుమంతరావు  గానీ,  జైరాం రమేశ్ గానీ,  లేకపోతే  జేడీ శీలంగాని  స్పందించి  అసలు  అక్కడ జరిగిన విషయం బయటపెడితే గానీ  అసలు  నిజం బయటకు రాదని హనుమంతన్న అభిమానులు అంటున్నారు.  ఏమైన ఇలాంటి ఫోటోలతో..పార్టీ  పరువు, నేతల పరువు పోతుందని కొంత మంది సీనియర్ రాజకీయ నాయకులు అంటున్నారు.   

ఇలాంటి ఫోటో ను  సోషల్ మీడియలో  పెట్టినందుకు  తగిన చర్యలు తీసుకోవాలని  హనుమంతన్న అభిమానులు  కోరుతున్నారు.  దీనిపై  వీహెచ్  ఏమంటారో చూద్దాం.

-ఆర్ఎస్

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles