More access to morphine an opium product

More access to Morphine an opium product, cancer patients access to morphine, India produces 90 percent of morphine manufacture, Morphine drug for cancer patients

More access to Morphine an opium product

ఎక్కువ అందుబాటులో నల్లమందు ఉత్పాదన మార్ఫిన్

Posted: 02/22/2014 12:15 PM IST
More access to morphine an opium product

పార్లమెంట్ పాస్ చేసిన బిల్ల వలన క్యాన్సర్ రోగులకు ఇక నల్లమందు (ఓపియమ్) తో తయారయ్యే మార్ఫిన్ ఎక్కువ ప్రమాణంలో అందుబాటు కాబోతోంది.  ఇప్పుడున్న దానికి 40 శాతం ఎక్కువగా అందుబాటులోకి రావాలని రాష్ట్రస్థాయి ఆర్ధిక మంత్రి కోరటమైంది.

2011 లో లోక్ సభలో ఆమోదం పొందిన నార్కోటిక్ డ్రగ్స్ అండే సైకోట్రాపిక్ సబ్ స్టన్సెస్ (ఎమెండ్ మెంట్) బిల్ ను రాజ్యసభలో మూవ్ చేసిన రాష్ట్రాల ఆర్థిక మంత్రి జెడి సలేం, ప్రపంచంలో మార్ఫిన్ ఉత్పాదనలలో 90 శాతం భారతదేశంలో తయారౌతోందని అన్నారు.  ఉత్పాదన చెయ్యటం అవసరమే కానీ దాని నియంత్రణకూడా సమానంగా ప్రాధాన్యతను సంతరించుకుంటుందని ఆయన అన్నారు. 

ప్రస్తుతం జారీలో ఉన్న 1985 నాటి చట్టం ప్రకారం మార్ఫిన్ లభించాలంటే అందుకు అర్జీలు పెట్టుకోవాలి, ఆ తర్వత ఎంతో తతంగం ఉంది.  అలా కాకుండా కాన్సర్ రోగులకు శారీరక బాధ నుండి ఉపశమనం కలిగించటానికి ఉపయోగపడే మత్తు పదార్థమైన మార్ఫిన్ ను వాళ్ళిక మరింత అందుబాటులోకి తేవాలన్నదే ఈ ఎమెండ్ మెంట్ ఉద్దేశ్యం. 

2011 లో అప్పటి ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ ప్రవేశపెట్టిన ఈ బిల్లును లోక్ సభ శుక్రవారం నాడు ఆమోదించింది.  అయితే, దాని వలన జరగగల దుర్వినియోగం, ఫలితంగా జరిగే నష్టాల గురించి సభ్యులు అభ్యంతరాలు తెల్పగా, చట్టం చట్టమే దాన్ని ఎలా ఉపయోగించాలన్నది విజ్ఞత మీద ఆధారపడివుంటుందని ఆయన అన్నారు.

ఈ ఎమెండ్ మెంట్ బిల్లులో మార్ఫిన్ ఉత్పాదనకు, ఆధీనంలో ఉంచుకోవటానికి, రవాణాకి, ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి తరలించటానికి, అమ్మకం కొనుగోళ్ళకి, వినియోగానికి అంటే అవసరమైన ఈ మత్తు పదార్థ ఉత్పాదనను ఉపయోగించటానికి తగు రుసుమును కూడా పొందుపరచటమైంది. 

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles