High security to seemandhra hyderabad cyberabad

High security to Seemandhra Hyderabad Cyberabad, AP State Reorganization bill, Seemandhra Ministers, Rahul Gandhi

High security to Seemandhra Hyderabad Cyberabad

ఆఖరిపోరాటం కూడా విఫలం- రాష్ట్రానికి బలగాలు

Posted: 02/18/2014 11:17 AM IST
High security to seemandhra hyderabad cyberabad

సీమాంధ్రమంత్రులు ఏఐసిసి వైస్ ప్రెసిడెంట్ రాహుల్ గాంధీతో భేటీ అయ్యారు. 

రాష్ట్ర విభజన బిల్లు విషయంలో మంత్రుల ఆవేదన, సూచనలను విన్న రాహుల్ గాంధీ విభజన తథ్యమని, సీమాంధ్రకు ప్రత్యేక ప్యాకేజ్ ఉంటుందని స్పష్టం చేస్తూ,  హైద్రాబాద్ ని యుటి చెయ్యటం అసాధ్యమని తేల్చి చెప్పారు.

ఈ లోపులో పార్లమెంటులో సీమాంధ్ర సభ్యుల ఆందోళనల నడుమ ఉభయ సభలూ 12 గంటల వరకు వాయిదా పడ్డాయి.  లోక్ సభ ప్రారంభమౌతూనే తెలంగాణా బిల్లు మీద చర్చ జరిగే అవకాశం ఉంది.  చర్చ జరగాలే కానీ మూజుబాణీ ఓటింగ్ తో ఆమోదించరాదని భాజపా ముందుగానే కోరింది.

తెలంగాణా బిల్లుకి లోక్ సభలో ఆమోదం జరిగే సందర్భంలో సీమాంద్ర ప్రాంతాల్లో అల్లర్లు జరగకుండా ఇప్పటికే రాష్ట్రానికి బలగాలను పంపించింది కేంద్రం.  సీమాంధ్ర ప్రాంతంలో సమస్యాత్మక ప్రాంతాలకు పారా మిలిటరీ ఫోర్స్ ని పంపించటం జరుగుతోంది.  సీమాంధ్రతో పాటుగా హైద్రాబాద్ సైబరాబాద్ లలో కూడా భారీ భద్రతా ఏర్పాట్లు జరుగుతున్నాయి.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles