Kiran kumar decides to form new party

Kiran Kumar decides to form new party, Chief Minister, TG Venkatesh, Yerasu Pratapa Reddy, Kiran Kumar Reddy new party, Telangana Bill, BJP

Kiran Kumar decides to form new party, Chief Minister

కొత్త పార్టీకే కిరణ్ కుమార్ ఓటు

Posted: 02/17/2014 07:47 AM IST
Kiran kumar decides to form new party

ఎన్నో రకాలుగా ఆలోచించి, సన్నిహితులతో మంతనాలు జరిపిన తర్వాత ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ చివరకు కొత్త పార్టీ పెట్టటానికే నిశ్చయించుకున్నట్లుగా సమాచారం. 

అధిష్టానాన్ని ఢీకొంటూ, దేనికీ వెరవని, తనతో పాటు కదం కలిపే తనదంటూ ఒక సేనను తయారు చేసుకోవటానికి కిరణ్ కుమార్ ఆదివారం చేసిన సుదీర్ఘమైన చర్చలలో ఆయన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో భేటీ అయ్యారు. 

రాష్ట్ర విభజన ప్రక్రియలో సాధనం కాదలచుకోని కిరణ్ కుమార్ రెడ్డి పార్లమెంట్ లో బిల్లు ప్రవేశపెట్టిన వెంటనే రాజీనామా చెయ్యదలచుకున్నారు.  అయితే బిల్లును ప్రవేశపెట్టారా లేదా అన్నది చర్చనీయాంశంగా మారింది.  ప్రధాన ప్రతిపక్షమైన భాజపా కూడా బిల్లుని పార్లమెంటులో పెట్టలేదని అనటంతో మంగళవారం వరకు వేచి చూద్దామనుకుంటున్నారు.  ఈ లోపులో పార్లమెంట్ వ్యవహారాల మంత్రి కమలనాధ్ బిల్లును కావాలంటే మరోసారి పెడతామని ప్రకటించారు.

ఇప్పుడు రాజీనామా చేస్తే విభజన బిల్లును పార్లమెంట్ లో పెట్టారని అంగీకరించనట్లవుతుందని కిరణ్ కుమార్ భావిస్తున్నారు.  ఈ మాటను మంత్రి టి.జి.వెంకటేష్ మీడియాలో ధృవీకరించారు కూడా. 

తెలుగు ప్రజల మనోభీష్టానికి వ్యతిరేకంగానే కాదు, ఆత్మగౌరవం దెబ్బతినేట్టుగా ప్రవర్తిస్తున్న ఒంటెద్దు పోకడల కాంగ్రెస్ పార్టీలో కొనసాగటం ఇష్టం లేదని, అందుకే ఆయన ముఖ్యమంత్రిగా రాజీనామా చెయ్యటంతో పాటుగా మౌలికంగా పార్టీ సభ్యత్వం నుండి కూడా వైదొలగాలని భావిస్తున్నానని కిరణ్ కుమార్ తను భేటీ అయిన నాయకులతో స్పష్టంగా తెలియజేస్తూ ఎవరి మద్దతు ఎంత ఉంటుందన్న విషయంలో బేరీజులు వేస్తున్నారు. 

అయితే రాష్ట్ర విభజన జరిగినా జరగకున్నా కొత్త పార్టీ పెట్టటం ఖాయమని ఏరాసు ప్రతాపరెడ్డి అన్నారు.  బిల్లు మంగళ బుధవారాల్లో ప్రవేశపెట్టి చర్చకు తీసుకుని రావొచ్చని ఢిల్లీలో అనుకుంటున్నారని, అది ఎప్పుడు జరిగినా కిరణ్ కుమార్ రెడ్డి రాజీనామా చెయ్యటమైతే ఖాయమని టిజి వెంకటేష్ అన్నారు.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles