Added sugar adds more risk to heart

added sugar adds risk to heart, natural and added sweetness, cardio-vascular death risk with added sugar, added sugar adds threat to life

added sugar adds more risk to heart, added sugar other than natural sweetness

చక్కెర తెచ్చే చేటు- ఒక పరిశోధన

Posted: 02/08/2014 12:52 PM IST
Added sugar adds more risk to heart

సంతోషాలను పంచుకునేటప్పుడు నోరు తీపి చేసుకునే అలవాట మనకు బాగా ఉంది.  పుట్టినరోజు, వైవాహిక వార్షిక వేడుకలు, భగవంతుడి ప్రసాదం రూపంలో కానీ, పండుగలు పబ్బాలకు పంచదార మిళితమైన వంటకాలను చేసుకోవటం పరిపాటి. 

కానీ పంచదార ఎక్కవగా వాడేవాళ్ళకి గుండె సంబంధిత వ్యాధులు సంక్రమించే అవకాశం ఎక్కువ స్థాయిలో ఉందని పరిశోధనలో తేలింది.  సహజసిద్ధంగా పండ్లలో పండ్లరసాలలో ఉండే తీపిదనం కాకుండా అదనంగా జోడించే పంచదార తీపి విషయంలో 20 సంవత్సరాల కాలం పాటు  31147 మంది మీద చేసిన పరిశోధన ఫలితాన్ని జామా ఇంటర్నల్ మెడిసిన్ నెట్ లో పోస్ట్ చేసింది.  దాని ప్రకారం 10 నుంచి 25 శాతం వరకు అదనంగా జోడించి తయారుచేసిన వంటకాలను తీసుకున్న వారిలో గుండె జబ్బు బారినపడటానికి ఉండే అవకాశాలు 30 శాతం వరకు పెరిగాయని తెలియజేసారు.  అదే 25 శాతం వరకు వచ్చేసరికి అది కాస్తా మూడింతలు రిస్క్ కనపడుతోంది.

ఈ ఫలితాలను ఇతర స్థితులను తీసుకోకుండా ఒట్టిగా అందరిమీదా పరీక్షించి చూసింది కాదు.  వాళ్ళ వయసులు, సిగరెట్లు, శృంగారం లాంటి అలవాట్లను, వాళ్ళ జీవన విధానాన్ని పూర్తిగా పరిగణనలోకి తీసుకుని చేసిన పరిశోధనలో వచ్చిన ఫలితాలనే వాళ్ళు వెల్లడి చేసారు. 

అలా అదనంగా జోడించినవి, కాఫీ టీలు, కేక్ లు క్యాండీలు, పాలతో చేసే తీపి పదార్థాలు ఏమైనా కావొచ్చు కానీ ఎక్కువ పాళాల్లో కలిపిన పంచదార గుండె పనితనంలో మార్పులు తీసుకువస్తుందంటున్నారు పరిశోధకులు.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles