Money playing major role in elections

Money playing major role in elections, State Election Officer Bhanwarlal, Election Commission of India, Paid news is crime

Money playing major role in elections, State Election Officer Bhanwarlal, Election Commission of India

ఎన్నికలలో ప్రధానపాత్ర డబ్బుదే!

Posted: 02/06/2014 09:35 AM IST
Money playing major role in elections

ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్నాటక ఈ మూడు రాష్ట్రలలో ఎన్నికల సమయంలో డబ్బు ప్రధానపాత్ర వహించిందని, అది ఈ మూడు దక్షణాది రాష్ట్రాలలో ఎక్కువ స్థాయిలో జరిగిందని పరిశీలనలో తేలినట్లుగా ఎన్నికల కమిషన్ వెల్లడించింది. 

ఈ సందర్భంలో రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి భన్వర్ లాల్ మాట్లాడుతూ పై మూడు రాష్ట్రాలలో ఎన్నికల సమయంలో పెట్టిన ఖర్చు విపరీతమైన స్థాయిలో ఉండటమే కాకుండా డబ్బిచ్చి వేయించుకున్న వార్తా కథనాలు కూడా ఎక్కువ ప్రమాణంలో ఉన్నాయని అన్నారు.   ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థులలో సగం మంది అయిన ఖర్చుకంటే చాలా తక్కువ చూపించారని భన్వర్ లాల్ అన్నారు.  కొన్ని వార్తా పత్రికలు, ఇతర మీడియా సాధనాలు రాజకీయ పార్టీలకు మద్దతుగా పనిచేసాయన్నారాయన. 

ఎన్నికల ఖర్చుల నియంత్రణ, కొనుక్కునే వార్తల గురించి జరిగిన సమావేశంలో పై విధంగా భన్వర్ లాల్ మాట్లాడిన తర్వాత ఎన్నికల ఖర్చుల డైరెక్టర్ జనరల్ పి.కె.దాశ్ మాట్లాడుతూ, ఎన్నికలలో డబ్బు ఇవ్వటం కానీ పుచ్చుకోవటం కానీ నేరమౌతుందని, అటువంటి నేరానికి ఒక సంవత్సర కాలం వరకూ జైలు శిక్షకు అర్హులౌతారని, ఈ విషయంలో పౌరులలో అవగాహన రావటానికి మీడియా కృషిచేయాలని అన్నారు. 

నాగాల్యాండ్, అరుణాచల్ ప్రదేశ్ లో కూడా కొన్ని ప్రాంతాలలో డబ్బు ఇచ్చిపుచ్చుకోవటాలు జరిగాయని అన్న భన్వర్ లాల్ అస్సాంలాంటి రాష్ట్రాలో విలువలను పాటించారని అన్నారు.  అక్కడి వోటర్లు డబ్బు ఇచ్చిపుచ్చుకోవటాన్ని వ్యతిరేకించారని చెప్పారు. 

డబ్బు తీసుకుని అనుకూలమైన వార్తాకథనాలుగా ప్రజల ముందుకు తీసుకునివచ్చే మీడియా మీద వేటు ఉంటుందని దాశ్ హెచ్చరించారు.  కొన్ని తిరుగుతూ పరిశీలించేవి మరి కొన్ని నిలకడ ఉండి జరుగుతున్న పరిణామాలను కనిపెట్టే బృందాలను ఎన్నికలలో ప్రవేశపెడుతున్నామని, దానితోపాటు మేజిస్ట్రేట్ లు కూడా ఈ పని కోసం నియమించబడుతున్నారని, దానితో డబ్బు, మద్యం ఎన్నికలలో పారటాన్ని అరికడతామని తెలియజేసారు.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles