మనవాళ్ళు బ్యాంకాక్ కి పోవటానికి, కొంతకాలం అక్కడ ఉండటానికి ఉత్సాహం చూపిస్తున్నారంటే అక్కడ ఏదో ప్రత్యేకత ఉండాలి కదూ. మనిషి ప్రశాంతంగా, అడ్డంకులు లేకుండా, స్వేచ్ఛగా, తను కోరుకున్నవి పొందటానికి కాని, అనుకున్న పనులు పూర్తిచేసుకోవటానికి కాని, విశ్రాంతిగా సేదతీరటానికి కాని, వినోదాలతో కాలం గడపటానికి కానీ అనువైన ప్రదేశం ఉందంటే సప్తసముద్రాలు దాటి కూడా వెళ్ళటం జరుగుతుంది. ఎంత వ్యయమైనా భరించటం జరుగుతుంది. అదే మరీ ఎక్కువ దూరం పోకుండా, ఎక్కువ ఖర్చు కూడా పెట్టకుండా, మరీ దుర్లభమైన వీసా నియమాలు లేని ప్రధేశానికి పోవటం అంటే ఎగిరి గంతేస్తారు. అలాగే జరుగుతోంది బ్యాంకాక్ విషయంలో.
ఒక్కొక్కరి జీవన శైలి, ఒక్కొక్కరి ఆవశ్యకతలు, వారి ప్రాధాన్యతలు వేరువేరుగా ఉంటాయి. కానీ అన్నిరకాల వాళ్ళూ థాయ్ ల్యాండ్ రాజధాని బ్యాంకాక్ కి వరసకడుతున్నారంటే అక్కడేదో విశేషం ఉండివుండాలి కదూ. అవి ఇవి-
1. ఉండటానికి, తినటానికి పెట్టే ఖర్చు మిగిలిన విదేశాలతో చూస్తే తక్కువ. అందువలన అక్కడ వాతావారణం నచ్చి కొంతకాలం ప్రశాంతంగా అక్కడ ఉండాలనుకునేవాళ్ళకి బ్యాంకాక్ మంచి ప్రదేశం. అంటే మన దేశం కంటే తక్కువని కాదు కానీ టూరిస్ట్ గా వివిధ దేశాలకు పర్యటనకు పోయేవాళ్ళకి బ్యాంకాక్ లో రేట్లు మిగిలిన పర్యాటక దేశాలకంటే తక్కువ.
2. ఇంటర్నెట్ మీద ఆధారపడి పనులు చేసుకుంటున్నవారికి బ్యాంకాక్ చాలా చక్కని చోటు. ఇంటర్నెట్ సదుపాయంతో పాటు నివాసముండే స్థలాలు లభిస్తాయి. ఇలాంటి సదుపాయాలు కౌలాంలంపూర్ లో కూడా లభిస్తాయనుకోండి, కానీ ఇదొక్కటే కాదు ఇంకా చాలా సౌలభ్యాలున్నాయి బ్యాంకాక్ లో.
3. చాలా దేశాలలో ఇంటర్నెట్ కనెక్షన్ చాలా ఆలస్యంగా నడుస్తుంటాయి. యూరప్ లో వేగవంతంగా నడిచే నెట్ కనెక్షన్ ఉన్నా రేట్లు చాలా ఎక్కువ. కానీ బ్యాంకాక్ లో ఇంటర్నెట్ తో ఉన్న లాడ్జ్ లు దొరకటమే కాకుండా, బయట కూడా వైఫై ద్వారా నెట్ కనెక్షన్ సమృద్ధిగా లభిస్తుంది. నెలసరి ప్లాన్ లతో వైఫై కనెక్షన్ తీసుకోవటం చాలా సులభం, సౌకర్యం కూడా.
4. రోడ్ పక్క లభించే ఆహారం చాలా రుచిగా శుచిగా నోరూరిస్తూవుంటుంది. పైగా ఖర్చు కూడా తక్కువే. ఒక డాలర్ కి భోజనం చెయ్యవచ్చంటే అక్కడ ఉండటానికి పర్యాటకులకు జేబు భారం పడకుండా ఉంటుంది కదూ.
5. ప్రకృతి సౌందర్యాన్ని తిలకిస్తూ, నిర్మల మైన నీటిలో ఈతలు కొట్టటానికి కావలసినన్ని ప్రదేశాలున్నాయి.
6. బీయర్, ఇతర మత్తు పానీయాలు కూడా చవక ధరకే లభిస్తాయి. తిరిగి తిరిగి రాత్రి ఒక పెగ్గు వేసుకుంటే కానీ కిక్ ఎక్కని వాళ్ళకి ఇది కూడా బాగా నచ్చుతుంది. తక్కువ రేటుంటే ఎక్కువగా తృప్తి తీరా తాగటానికి కానీ లేదా ఎక్కువ రోజులు గడపటానికి కానీ పనికివస్తుంది.
7. బ్యాంకాక్ లో రాత్రి పూట జీవితం పర్యాటకుల అవసరాలలో ఒకటైన శృంగారంతో కూడిన వినోదం కూడా పుష్కలంగా లభిస్తుంది. పాదాలకు చేసే మసాజ్ లు, ఇతర పాదసేవలు (పెడిక్యూర్) దగ్గర్నుంచి బాడీ మసాజ్ లను సరదాగా 'పెద్దలకు మాత్రమే' జోకులు వేసుకుంటూ కస్టమర్లను అలరిస్తారు.
8. పైపై తంతు కాదు శృంగారం పూర్తి స్థాయిలో కావాలనుకునేవారికి కూడా బ్యాంకాక్ లో అందుకు కొదవు ఉండదు. ఒంటరి గుండెలు జారి గల్లంతవటానికి చక్కని అవకాశం లభిస్తుంది. ఒకే యువతితో అన్ని రోజులు గడపాల్సిన పని కూడా లేదు. రోజుకో పంచదార చిలక ఒళ్ళో వాలుతుంది డబ్బులుంటే చాలు కాని. ఒక్కళ్ళే అనేముంది, శాండ్ విచ్ శృంగారం కూడా అంటే ఇద్దరు యువతుల మధ్య పురుషుడు మసాజ్ చేయించుకోవచ్చు. ప్యాట్ పాంగ్ రోడ్, నానా ప్లాజా, సోయ్ కౌ బాయ్ ప్రదేశాలు వ్యభిచారానికి ప్రసిద్ధిగాంచిన స్థలాలు.
అయితే కొన్ని చివుక్కుమనిపించే అంశాలు కూడా ఉన్నాయనుకోండి!
1. మీరు విదేశీయులని, మొదటిసారి బ్యాంకాక్ సందర్శించటానికి వెళ్ళారని తెలిస్తే టాక్సీ వాలాలు మెత్తగా దోచుకుంటారు. పైకి చాలా చక్కగా నవ్వుతూ, ఆప్యాయంగా పలకరిస్తూ మీకు సేవ చెయ్యటంకంటే వాళ్ళ జీవితంలో మరే ధ్యేయం లేదన్నట్లుగా మాట్లాడుతూ మామూలుగా చేసే ఛార్జ్ కి ఎన్నో రెట్లు ఎక్కువ గుంజేస్తారు.
2. అటూ ఇటూ దిక్కులు చూస్తే నడుస్తున్నారంటే మీకు అన్ని రకాల సేవలందించటానికి మార్గదర్శకులు ప్రత్యక్షమై మీకు ఏం కావాలన్నా దొరుకుతుందన్న భరోసా ఇచ్చి మిమ్మల్ని దగా చేసి మీ చేత విపరీతంగా ఖర్చు పెట్టించే ప్రయత్నం చేస్తారు. అందులో వాళ్ళకి దండిగా కమిషన్ లభిస్తుంది.
3. సరే వాళ్ళంటే పొట్టకూటికి ఏదో మోసం చేస్తున్నారనుకుంటే, ప్రభుత్వం ఏమీ తక్కువ తినలేదు. బ్యాంకాక్ లో ప్రసిద్ధ పర్యాటక స్థలమైన గ్రాండ్ ప్యాలెస్ ని సందర్శించటానికి వెళ్తే అక్కడ స్థానికులకు ఒక లైన్, విదేశీయులకు మరో లైన్ ఉంటుంది. అది ఎందుకంటే ప్రవేశ రుసుములో తేడా ఉంది. సరే, అది చాలా దేశాలలో ఉంటుందనుకోండి, మన దేశంలో కూడా కొన్ని పర్యాటక ప్రాంతాలలో ఉంది. కానీ ఆ తేడా మరీ ఎక్కువగా ఉండి, తీరా లోపలకి పోయి చూసిన తర్వాత పెద్ద గొప్పగా అనిపించనప్పుడు మనసు చివుక్కుమంటుంది. పోయిన డబ్బులు కాదు వంచించబడ్డామనే ఆలోచన మనసుని చికాకు పరుస్తుంది.
4. శృంగారం చవకగానూ విరివిగానూ దొరికినా, వాళ్ళంతా ఆరోగ్యవంతులేమీ కారు. పైగా ఎంత ప్రేమ ఒలకబోసినా వాళ్ళకది ఒక వృత్తి. వాళ్ళకంటూ వాళ్ల జీవితం, మళ్ళీ అందులో ఒక బాయ్ ఫ్రెండ్ ఉంటాడు. దీని కోసం దేశం కాని దేశాని రావటం అవసరమా అనే ప్రశ్న కూడా ఉదయించవచ్చు.
5. మనిషికి కావలసినవి ఏమిటి, మనిషి కోరుకునేవి ఏమిటి అని చూస్తే కడుపుకి తిండి, కలతలు లేకుండా ఆనందంగా జీవించటం, రాత్రవగానే మధిర మగువలతో శృంగారం అని అనుకుంటే వాటిని ఇవ్వటమే కాదు ప్రలోభపెట్టే వ్యసనాలనన్నిటినీ సంతృప్తిపరచే సదుపాయాలతో పర్యాటకులను స్వర్గలోక ద్వారాల దాకా తీసుకెళ్తున్న భావన కలిగిస్తున్న బ్యాంకాక్ గురించి నిదానంగా ఆలోచిస్తే, ఇదేనా వాళ్ళ జీవనం, ఇదేనా వాళ్ళ ఉపాధి, ఇదేనా వాళ్ళ ప్రభుత్వం ఆశించే ఆదాయం అనే ప్రశ్నలు కూడా ఉదయిస్తాయి. అక్కడి వారి సంస్కృతి గురించి ఎవరేమనుకుంటారనే పట్టింపు వాళ్ళకున్నట్టు ఎంతమాత్రం కనపడదు.
సారాంశం
ప్రపంచ పర్యాటక దేశాలలో చూసుకుంటే థాయ్ రాజధాని బ్యాంకాక్ లో మనిషికి కావలసినవన్నీ లభిస్తాయి, పైగా అన్నీ చవకే.
అయితే ప్రపంచంలో అన్నీ ఉంటాయి. అమృతం ఉంది విషమూ ఉంది. ఆక్సిజన్ ఉంది కార్బన్ డైయాక్సైడూ ఉంది. మంచీ ఉంది చెడూ ఉంది. మనకు అవసరమైనవీ ఉంటాయి, అవసరం కానివి హాని కలిగించేవి కూడా ఉంటాయి. అలాంటి ప్రపంచానికో సూక్ష్మరూపం బ్యాంకాక్. అందువలన అక్కడ మనకు ఏం కావాలో మనమే నిర్ణయించుకోవాలి. మంచీ చెడూ ఏ ప్రదేశానికీ అంటగట్టలేము.
మన దేశంలో కూడా తీర్థస్థలాలను పవిత్రంగా చూసేవారూ ఉన్నారు, ఆ స్థలాలలో అమాయకులను మోసం చెయ్యటానికి, వ్యభిచారం లాంటి చట్ట వ్యతిరేకమైన వ్యాపారాలు చెయ్యటానికి చూసేవారూ ఉన్నారు. అయితే బ్యాంకాక్ లో పట్టుబడతామనే భయం లేదు. ఎందుకంటే అంతా చట్ట సమ్మతమే కాబట్టి. అదే తేడా!
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more