Rare interview of modi s ex wife

Rare interview of Modi's ex wife, Narendra modi wife Jashodaben, Jashodaben talks good about Modi, Narendra Modi BJP, BJP Prime Ministerial candidate Modi,

Rare interview of Modi's ex wife, Narendra modi wife Jashodaben

మోదీ మాజీ భార్య జషోదాబేన్ అరుదైన ఇంటర్వ్యూ

Posted: 02/01/2014 05:37 PM IST
Rare interview of modi s ex wife

రాజకీయ నాయకుల వైవాహిక జీవితంలో ఒడిదుడుకులు లేకుండా ఉండటం చాలా అవసరం.  ఎందుకంటే నాయకుడిని సంపూర్ణంగా ప్రజలు సమ్మతించాలంటే ఆయన జీవితం పారదర్శకంగా, నీతివంతంగా, మచ్చ లేకుండా ఉండాలి.  భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోదీ ఇప్పటి వరకు కాస్తో కూస్తో గుజరాత్ అల్లర్ల విషయంలో అల్లరిపడుతూ వచ్చినా అది కూడా హైకోర్టు తీర్పుతో తొలగిపోయింది. 

ఇక ఉన్నది ఆయన వైవాహిక జీవితం ఒక్కటే.  చాలా సంవత్సరాలుగా విడిపోయి విడివిడిగా జీవితాన్ని సాగిస్తున్న జంట అది.  నరేంద్ర మోదీకి వేరే స్త్రీతో ఎటువంటి సంబంధమున్న వార్తలు కానీ మరెటువంటి మచ్చలు కానీ ఎవరితోనూ పొరపచ్చలు కానీ లేవు.   ఆయన తల్లిదండ్రులు ఏర్పాటు చేసిన వివాహం జరిగినప్పుడు ఆయన భార్య జషోదాబేన్ వయసు 17 సంవత్సరాలు.  ఇప్పుడామె వయసు 62 సంవత్సరాలు.

జషోదాబేన్ ఇచ్చిన అరుదైన ఇంటర్వ్యూలో ఆమె మోదీతో సంబంధం తెగిపోయిన విషయంలో ఎటువంటి ఆరోపణలు లేవని చెప్పారు.  అంతేకాదు ఆమె తను మోదీ అభిమానిని అని కూడా చెప్తూ ఆయన ప్రధానమంత్రి అవాలని ఆకాంక్షిస్తున్నవారిలో తాను ఒకతినని అన్నారు. 

స్కూల్ టీచర్ గా పనిచేసిన జషోదా బేన్ తనకి వస్తున్న పెన్షన్ రూ.14000 తో తన సోదరుని దగ్గర ఉంటున్నారు.  వాళ్ళిద్దరూ విడిపోవటం ఝగడాలతో జరగలేదని, ఇష్టపూర్వకంగానే విడిపోయామని అన్నారు.  వైవాహిక జీవితం గడిపిన మూడు సంవత్సరాలలో వాళ్ళు కలిసివున్నది కేవలం మూడు నెలలేనట.  మోదీ గురించి ఎటువంటి వార్త వచ్చినా ఎంతో ఆసక్తిగా చదువుతుంటానని చెప్పారామె.  మోదీ మళ్ళీ తనతో కలిసి మాట్లాడుతారని కూడా ఆశించటంలేదని చెప్పారు జషోదాబేన్. 

నరేంద్ర మోదీ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ లో ఉన్నత శిఖరాలను అధిరోహించటానికి సంఘ్ నియమాలననుసరించి వైవాహిక జీవితానికి దూరంగా ఉన్నారని ఆయన జీవిత చరిత్రను ఈ మధ్యనే రచించిన నీలాంజన్ ముఖ్యోపాధ్యాయ రాసారు.  ఆయన తన ఆశయాల కోసం ఎంతో ఎత్తున పెట్టుకున్న లక్ష్యాల కోసం వైవాహిక బంధాన్ని తెంచుకున్నారని జషోదా బేన్ అన్నారు.

ఆమె 2012 లో ఒకసారి టివి ఇంటర్వ్యూలో తాను మోదీ భార్యను అన్నందకు ఆయన తన అఫడవిట్ లో బ్రహ్మచారినని రాసినందుకు విమర్శలు చేసాయి.  కానీ విడిపోయిన తర్వాత చట్టరీత్యా ఎవరైనా బ్రహ్మచారే కదా! ఆ మాటకు ఆమె తన ఇంటర్వ్యూలో ఆయన పెట్టుకున్న లక్ష్యాల వలన, రాజకీయ రంగంలో నడుస్తున్న చెడు సమయం వలన అలా చెప్పటం సమంజసమేనన్నారు. 

టైమ్స్ ఆఫ్ ఇండియా వార్తాకధనం ఆధారంగా-

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles