How akkineni called natasamrat

How akkineni called Natasamrat, Akkineni Nageswara Rao passed away, Akkineni Nageswara Rao cremated, ANR passed away, ANR Natasamrat

How akkineni called Natasamrat

అక్కినేని నటసామ్రాట్ ఎలా అయ్యారు?

Posted: 01/24/2014 09:03 AM IST
How akkineni called natasamrat

జగమెరిగిన బ్రాహ్మణునికి జంథ్యంబేలా అని అక్కినేని నాగేశ్వర రావుని నటసామ్రాట్ అని ఎవరు పిలిచారు, ఆయనకు ఆ బిరుదు ఎలా వచ్చిందన్నది మరుగున పడిన విషయం, దాన్ని ఎవరూ తరచి చూడని సంఘటన.

అక్కినేని 60 సినిమాలు పూర్తి చేసుకున్న సందర్భంగా అప్పట్లో దక్షిణాది సినిమా పరిశ్రమకు కేంద్రస్థానమైన మద్రాసులో ఆయనను ఘనంగా సత్కరించారు.  దానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నీలం సంజీవ రెడ్డి, తమిళనాడు ముఖ్యమంత్రి కామరాజ్ నాడార్, కర్నాటక ముఖ్యమంత్రి నిజలింగప్ప హాజరవటం విశేషం.  అయితే తమిళనాడులోనే ఇంత గొప్పగా మన తెలుగు నటుడిని సత్కరించినపుడు మనం ఎందుకు చెయ్యగూడదు అని ఆంధ్రప్రదేశ్ లో కృష్ణా జిల్లా వాసియైన అక్కినేనికి విజయవాడలో కూడా సన్మానం జరగాలని అనుకున్న పెద్దలు మారుతీ టాకీస్, శ్రీనివాస మహల్ అధినేత పి.జి. బెనర్జీ మరి కొందరు కలిసి ఆలోచించి ధన వస్తు రూపంలో కాకుండా చిరకాలం నిలిచిపోయేట్టుగా ఏదైనా చెయ్యాలి అని నిర్ణయించుకున్నారు.

దాని ఫలితంగానే అక్కినేనికి విజయ టాకీస్ లో ఘనంగా సత్కరించి నటసామ్రాట్ అని బిరుదాంకితులను చెయ్యటం జరిగింది.  ఆ సన్మాన కార్యక్రమానికి ముచ్చటపడుతూ రాగూడనిది కూడా వచ్చిందట.  అదేమిటంటే గాలీ వానా.  టెంట్లు ఎగిరిపోయి అతిథులు కూర్చోలేని పరిస్థితుల్లో ఆయనకు సన్మాన పత్రం చదివివినిపించి నటసామ్రాట్ బిరుదు ప్రధానం చెయ్యటం జరిగింది. 

అయితే ఆ బిరుదు కొన్నాళ్ళు మరుగున పడింది.  అయితే అమెరికా పర్యటన చేసుకుని తిరిగి వస్తున్న సందర్భంగా అక్కినేని నాగేశ్వరరావుకి ఘన స్వాగతం పలుకుతూ, నటసామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు అని అందులో విస్తృతంగా ప్రచారం చేసేటప్పటికి అది అందరి దృష్టికీ వచ్చింది.  ఆ తర్వాత సినిమా టైటిల్స్ కూడా నటసామ్రాట్ అని రాయటం మొదలు పెట్టారు.  దాన్ని వింటూ వచ్చిన వారు దాన్ని ఉపయోగించారే కానీ ఆ బిరుదు ఎలా వచ్చిందన్న సంగతి మర్చిపోయారు.

అక్కినేని మాత్రం దాన్ని మర్చిపోలేదు.  అంతే కాదు పద్మభూషణ బిరుదు లభించినప్పుడు ఆయన తనకు దానికంటే నటసామ్రాట్ కే ఎక్కువ విలువైనదని అనటం విశేషం.  సినిమాల వాళ్ళంటే పెళ్ళి చేసుకోవటానికి పిల్లనివ్వటానికే సంశయించే కాలంలో ఈ సత్కారం, బిరుదు తనకు ఎంతో ప్రోత్సాహాన్నిచ్చాయని, ఆ కాలంలో సినీ కళాకారుడిగా తనకు లభించిన అంతటి గౌరవం ఎంతో మనోబలాన్ని ప్రసాదించిందని అక్కినేని అన్నారు.

పై ఫొటో పద్మవిభూషణ లభించిన సమయంలోది.  ఆయనకు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డ్, నాలుగు నంది అవార్డ్ లు, నాలుగు ఫిల్మ్ ఫేర్ అవార్డ్ లు, జీవిత సాఫల్య పురస్కారం మరెన్నో పురస్కారాలు సన్మానాలు జరిగాయి.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles