Last rites to akkineni with state honors

Last rites to Akkineni with state honors, Akkineni passed away, Akkineni Nageswara Rao, ANR passed away, ANR death, Akkineni state honors

Last rites to Akkineni with state honors

ఈరోజు అక్కినేనికి అధికార లాంఛనాలతో అంత్యక్రియలు

Posted: 01/23/2014 09:20 AM IST
Last rites to akkineni with state honors

నిన్న ఉదయం 2 గంటల ప్రాంతంలో అంతిమ శ్వాస విడిచిన అక్కినేని నాగేశ్వర రావుకి ఈ రోజు ప్రభుత్వ అధికార లాంఛనాలతో అంత్యక్రియలు జరుపనున్నారు.

మధ్యాహ్నం 3.30 గంటలకు అన్నపూర్ణ స్టూడియోస్ లో అంతిమక్రియలు జరపాలని నిశ్చయించారు.  అందుకు అన్నపూర్ణ స్టూడియోస్ లో ప్రత్యేకమైన ఏర్పాట్లు చేసారు.  దానికి ముందుగా మధ్యాహ్నం 12.30 కి ఫిల్మ్ ఛాంబర్ నుంచి అంతిమ యాత్ర ప్రారంభమౌతుంది. 

అక్కినేని పార్థివ శరీరాన్ని అంతిమ సందర్శనానికి అన్నపూర్ణ స్టూడియోస్ లో నిన్న ఉదయం 9.30 నుండి పెట్టగా రాజకీయ సినీ ప్రముఖులు, వేలాది మంది అభిమానులు చేరుకున్నారు.  కంట తడిపెట్టనివారు లేరు.  సినీ వినీలాకాశం నుండి ఒక తార రాలిపోయిందని ఎందరో బావురుమన్నారు. 

నిత్య నూతనంగా విలసిల్లే మాయాబజార్ చిత్రంలోని నటులలో ఆఖరిగా మిగిలిన అక్కినేని నాగేశ్వరరావు కూడా నిన్న అస్తమించారు. 

-శ్రీజ

Gallery of Celebs Pay Tribute To Akkineni

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles