Notification for rajysabha elections

Notification for Rajysabha elections, Nomications for Rajyasabha elections, Rajyasabha elections in AP, 6 seats for Rajyasabha in AP

Notification for Rajysabha elections

రాజ్యసభ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల

Posted: 01/21/2014 10:38 AM IST
Notification for rajysabha elections

రాజ్యసభ ఎన్నికలకు దేశవ్యాప్తంగా 55 సీట్లుండగా రాష్ట్రంలో 6 రాజ్య సభ స్థానాలకు పోటీలు జరుగుతాయి. 

ఫిబ్రవరి 7 న జరుగనున్న రాజ్యసభ ఎన్నికలకు నామినేషన్లను వేయటానికి జనవరి 21 నుంచి 28 వరకు సమయాన్ని ప్రకటించటం జరిగింది.  జనవరి 29 న నామినేషన్ల పరిశీలన ఉంటుంది.  నామినేషన్లను ఉపసంహరించుకోవటానికి ఆఖరు తేదీ జనవరి 31.

నామినేషన్లతో పాటు అభ్యర్థులు రూ.10000 జమానతుగా కట్టవలసివుంటుంది.  ఈ సొమ్ము షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ జాతులవారికి రూ.5000 మాత్రమే.

రాజ్యసభ సభ్యులను రాష్ట్ర శాసన సభ ఎన్నుకుంటుంది.  ఈ విధంగా పరోక్షంగా జరిగే రాజ్యసభ ఎన్నికలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 18 సీట్లను కేటాయించగా అందులో రిటైరై ఖాళీ అవుతున్న 6 సీట్లకు ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్నాయి. 

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles