Us dilemma in modi visa revoked

Modi Visa revoked, US dilemma with Modi Visa, Gujarat 2002 massacre, Modi US Visa Cancelled, BJP, BJP PM Candidate Modi, Devyani Khobragade visa fraud case

US dilemma in Modi Visa revoked

అమెరికాకు భారత్ నుంచి మరో తలనొప్పి మోదీ

Posted: 01/18/2014 12:57 PM IST
Us dilemma in modi visa revoked

దేవయాని ఖోబ్రాగడె కేసులో భారత్ తో అమీతుమీలు జరిగి ఎలాగో తమ గౌరవానికి భంగం కలగకుండా అందులోంచి బయటపడ్డ అమెరికాకు మరో తలనొప్పి నరేంద్ర మోదీ రూపంలో బయటపడుతోంది. 

గుజరాత్ లో 2002 లో జరిగిన నరమేధంలో కోర్టు నుంచి విముక్తి లభించినా, అమెరికా ప్రభుత్వం మాత్రం ఆ అల్లర్లకు బాధ్యుడిగా మోదీని గుర్తించి ఆయనకు వీసా ఇవ్వటానికి తిరస్కరిస్తూ వస్తోంది.  అయితే దరిమిలా మోదీ భారతీయ జనతా పార్టీ తరఫునుంచి 2014 సాధారణ ఎన్నికలకు ప్రధానమంత్రి అభ్యర్థి కావటం, భారత్ లో పర్యటన చేస్తూ తన ప్రసంగాలతో ప్రసిద్ధికి ఎక్కుతుండటం, నాలుగు శాసన సభ ఎన్నికలలో కాంగ్రెస్ ని చిత్తుగా ఓడించటం గమనించిన అమెరికాకు మోదీ వీసా మరో సమస్యగా మారింది. 

ఎన్నికలలో భాజపా అధికారంలోకి వచ్చినట్లయితే కాబోయ్ ప్రధాన మంత్రి మోదీయే అయిపోతారు.  2005 లో ఆయన వీసాను అమెరికా రద్దు చేసింది.  అప్పుడు కేవలం ఒక రాష్ట్రానికి పరిమితమైవుండటం వలన మోదీ వీసా తిరస్కరణ వలన పెద్దగా తేడా ఏమీ రాలేదు.  కానీ ఇప్పుడు జాతీయ నాయకుడిగా ఎదిగిన మోదీ విషయంలో మరోసారి భారత్ తో సంబంధాలలో ఎటువంటి చిక్కు వస్తుందోనని అమెరికా ప్రభుత్వం ఆలోచనలో పడింది. 

పోయిన సంవత్సరం నవంబర్ లో కూడా మోదీ వీసా విషయంలో అంతకు ముందులాగానే వీసా తిరస్కరణకు తీర్మానం చెయ్యటం జరిగింది.  ఇక ప్రధానమంత్రి గా ఎన్నికైనా, అమెరికా దేశం నుంచి మరి ఇతర దేశాల నుంచి కూడా మోదీకి అమెరికన్ వీసా జారీ చెయ్యటానికి అనుకూలంగా సమర్థన రాకపోవచ్చు.  అయితే మోదీ మాటలను బట్టి ఆయన విదేశీ పెట్టుబడులకు భారత్ వాణిజ్య ద్వారాలను బార్లా తెరుస్తారని తెలుస్తోంది.  కానీ ప్రధానమంత్రి హోదాకి వచ్చినా ఆయన గత జీవితంలోని అభియోగాల దృష్ట్యా వీసాకు అంగీకారాన్ని ఎలా ఇవ్వాలో తెలియటం లేదు అమెరికాకి. 

దీనివలన మోదీ వీసా విషయంలో అమెరికా మరో సారి తలపట్టుకుంటోంది.  వీసా ఇవ్వకపోతే భారత్ తో సంబంధాలు తెగిపోతాయి, ఇస్తే తన దేశంలో సమస్యలు ఎదురౌతాయి.  ఇదీ అమెరికాకు పట్టుకున్న తలనొప్పి.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles