Kodi pandaalu in andhra districts

kodi pandaalu in andhra districts, in sankranti days kodi pandaalu conducted east and west godavari districts

kodi pandaalu in andhra districts, in sankranti days kodi pandaalu conducted east and west godavari districts

కేక పుట్టిస్తున్న కోళ్ల పందాలు

Posted: 01/13/2014 10:11 AM IST
Kodi pandaalu in andhra districts

సంక్రాంతి సమీపిస్తోందంటే చాలు.... కోస్తా జిల్లాల్లో కోళ్ల పందాల హడావుడి మొదలవుతుంది. దీనిపై పోలీసులు  ఎంత ని ఘావేస్తున్నా పందాల రాయుళ్లు  ఏమాత్రం వెనక్కు తగ్గడం లేదు. పైగా పోలీసులతో కుమ్మక్కయి  పందాలు యధేచ్ఛగా  నిర్వహిస్తున్నారు. . పందాలను అడ్డుకోవాల్సిన  ప్రజా ప్రతినిధులు  సైతం అగ్నికి  ఆజ్యం పోస్తున్నట్లు  పందాలను ప్రోత్సహిస్తున్నారు.. ఈ పందాల నేపధ్యంలో వందలాది కోళ్లు ప్రాణాలు కోల్పోతున్నాయి.  ముఖ్యంగా  తూర్పుగోదావరి  జిల్లాల్లో  అత్యంత  ప్రతిష్టాత్మకంగా జరిగే ఈ పందాలను చూసేందుకు  సుదూర  ప్రాంతాల నుండి సైతం జనం రావడం విశేషం.

పలువు సినీ ప్రముఖులు , రాజకీయ నాయకులు  ఇక్కడకు చేరుకుంటున్నారు. . ఈ నేపథ్యంలో  ఈ సారి కోళ్ల పందాలకు  సుమారు 250 కోట్లు చేతులు మారనున్నాయని  విశ్లేషకుల అంచనా.  ఈ కోళ్ల పందాలను చూసేందుకు  వచ్చేవారితో ఇప్పటికే రాజమండ్రి , కాకినాడ తదితర ప్రాంతాల్లోని  లాడ్ఝీలు నిండిపోయాయి. సంక్రాంతి మొదలు కొని మూడు రోజులపాటు  జరిగే ఈ పందాలు నువ్వా నేనా అన్నట్టు సాగుతుంటాయి. వీటిని  అడ్డుకోవద్దంటూ  ప్రజాప్రతినిధుల  నుండి పోలీసులకు  వత్తిళ్లు రావడం సహజమైపోయింది.. అయితే ఇప్పడు తాజాగా రానున్న ఎన్నికలను  ఆసరా చేసుకుని  గ్రామీణులను  ఆకట్టుకునేందుకు  రాజకీయ నాయకులు  కోళ్ల పందాలను  అనువుగా మలచుకోవడం  విశేషం.

ప్రాంతీయ భేధాలకు అతీతంగా పందెంరాయుళ్లు  పోటీలను నిర్వహిస్తుంటారు. . పశ్చిమ గోదావరి జిల్లాలోని అయిభీమవరం, భీమవరం, ఉండి, మహదేవ పట్నం తదతర ప్రాంతాలు, తూర్పుగోదావరి  జిల్లాలోని మలికిపురం, రాజోలు, మామిడికుదురు  తదితర ప్రాంతాల్లో  పందాలు అధికంగా కొనసాగుతుంటాయి. . ఈ పందాల కోసం ప్రత్యేకంగా  గ్రౌండ్ ను సిద్ధం చేసి, పార్కింగ్ సదుపాయాలను కూడా నిర్వాహకులు  కల్పిస్తుంటారు. పైగా అక్కడ చిరుతిళ్లను, భోజనాలను సైతం ఏర్పాటు చేయడం విశేషం. పందాలలో పాల్గొనే కోళ్లను  చాలా శ్రద్ధతో పెంచుతారు. ఇందు కోసం వేల రూపాయలను ఖర్చు చేస్తారు.   ఖరీదైనా బాదం, పిస్తా వంటివి తినిపిస్తారు..  ప్రస్తుత ఎన్నికల  సంవత్సరం  నేపధ్యంలో జరుగు తున్న ఈ కోళ్ల పందాలు కేక పుట్టిస్తున్నాయి.. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles