Broom stick aap s permanent election symbol

AAP permanent symbol broomstick, Aam Admi Party broomstick, Arvind Kejriwal, Broomstick reserved to AAP, AAP State party

broom stick becomes AAP's permanent election symbol

కలిసొచ్చిన చీపురుని వదలని కేజ్రీవాల్

Posted: 01/04/2014 09:44 AM IST
Broom stick aap s permanent election symbol

అరవింద్ కేజ్రీవాల్ నాయకత్వంలో నడిచే ఆమ్ ఆద్మీ పార్టీకి అంతకు ముందు ఎన్నికల కోసం ఎలక్షన్ కమిషన్ తాత్కాలికంగా కేటాయించిన చీపురు చిహ్నం ఇప్పుడు పర్మనెంట్ అయింది.   ఆ పార్టీని రాష్ట్ర రాజకీయ పార్టీగా గుర్తించిన ఎన్నికల కమిషన్ పర్మనెంట్ మాత్రమే కాకుండా ఆ ఎన్నికల చిహ్నాన్ని అదే పార్టీకి రిజర్వ్ చేయటం కూడా జరిగింది.

ఆమ్ ఆద్మీ పార్టీ ఆ చిహ్నం తమకు పర్మనెంట్ గా కేటాయించమని అర్థించటంతో ఎన్నికల కమిషన్ ఆ పని చేసింది.  ఢిల్లీలో చీపురు సాధించిన విజయం దృష్ట్యా ఆ పార్టీ ఆ ఎన్నికల చిహ్నాన్ని తమ సొంతం చేసుకోవాలన్న ఉద్దేశ్యంతో ఆ విధంగా కోరుకోవటం జరిగింది. 

ఢిల్లీ నగరంలో రోడ్లను చీపురు ఊడుస్తూ, ఢిల్లీలో అవినీతనేది లేకుండా ఇలాగే ఊడ్చేస్తామనే సంకేతాలిచ్చిన ఆప్ రాష్ట్రనికి పరిమితమైన పార్టీ కాబట్టి ప్రస్తుతం ఆ పార్టీకి కేటాయించిన ఆ చిహ్నం ఢిల్లీ వరకే వర్తిస్తుంది.  శేష భారతంలో చీపురు చిహ్నం స్వేచ్ఛగా ఏ పార్టీకైనా ఎన్నికల గుర్తు అవొచ్చు.   

ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకు ఆమ్ ఆద్మీ పార్టీ తమ పార్టీ చిహ్నంగా మరేదైనా చిహ్నాన్ని డిజైన్ చేయించుకోవచ్చు.  కానీ కలిసొచ్చిన చీపురు చిహ్నాన్ని వదులుకోవటానికి కేజ్రీవాల్ సిద్ధంగా లేరు.  అదే చిహ్నాన్ని ఇతర రాష్ట్రల్లో ఇతర పార్టీలు తీసుకునే ముందుగానే ఆప్ కూడా తమ పార్టీకి జాతీయ హోదా సంపాదించుకుని జాతీయ స్థాయిలో దాన్ని సొంతం చేసుకోకపోతే చీపురు గుర్తుని తన్నుకుపోవటానికి కొందరు సిద్ధమవుతున్నరని వార్తలందుతున్నాయి. 

లాఫింగ్ బుద్ధాని పెట్టుకుని లాభాల బాటలో వెళ్ళేవాళ్ళని, శ్రీ మహాలక్ష్మి యంత్రాన్ని పెట్టుకుని సిరిసంపదలను సంపాదించినవాళ్ళని చూస్తే మరి మిగతావాళ్ళు కూడా వాటిని పెట్టుకుందామని చూడరా.   అలాగే చీపురుకి కూడా మహర్దశ వచ్చింది. 

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles