Sankalpa deeksha by congress mps

Sankalpa deeksha by MPs permitted, Conditions for Sankalpa Deeksha, Telangana Congress leaders, Telangana bill

Sankalpa Deeksha by Congress MPs

అధికారపక్షం చేసే దీక్షకు అధికారుల నుండి అనుమతి

Posted: 01/03/2014 08:55 AM IST
Sankalpa deeksha by congress mps

సీమాంధ్ర కాంగ్రెస్ పార్లమెంటు సభ్యులు ఈ రోజు హైద్రాబాద్ ఇందిరా పార్క్ దగ్గర చేయదలచుకున్నసంకల్ప దీక్షకు అనుమతి లభించింది. 

శాసన సభకు వచ్చిన తెలంగాణా బిల్లుకి వ్యతిరేకంగా సీమాంధ్ర ఎంపీలు రెండు రోజులు దీక్ష చేసి తమ నిరసనను తెలియజేయదలచుకున్నారు.  ఈ రోజు రాష్ట్ర పునర్విభజన బిల్లు ముసాయిదా శాసనసభకు చర్చకు రానుండటంతో సీమాంధ్ర పార్లమెంటు సభ్యులు నిరసన దీక్షలను సంకల్ప దీక్ష పేరుతో చేస్తున్నారు.

శుక్రవారం, శనివారం రెండు రోజులు చేసే ఎంపీల దీక్షకు డిసిపి కమలాసన్ రెడ్డి అనుమతిని జారీ చేస్తూ ఆ కార్యక్రమానికి కొన్ని షరతులు విధించారు.

1. నాయకులు చేసే ప్రసంగాలు ప్రజలను రెచ్చగొట్టే విధంగా ఉండకూడదు.
2. కార్యక్రమం కొనసాగిస్తున్నప్పుడు శాంతిభద్రతల పరిరక్షణకు సంబంధించి ఎటువంటి విఘాతాలు కలిగినా,  అనుమతిని రద్దు చెయ్యటం జరుగుతుంది. 
3. దీక్షా సమయంలో చట్ట వ్యతిరేక చర్యలు జరిగి ప్రజా ఆస్తులకు నష్టం వాటిల్లిన పక్షంలో అందుకు బాధ్యతను దీక్షను నిర్వహించేవారే స్వీకరించవలసివుంటుంది.

మొత్తానికి అధికార పక్షమే ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా సభలను నిర్వహించి దీక్షలను సాగించటానికి చేస్తున్న ప్రయత్నానికి అధికారికంగా అనుమతులు తీసుకుని చరిత్రనే సృష్టించారు మన రాష్ట్ర నాయకులు. ఇంతకు ముందు తెలంగాణా కాంగ్రెస్ నాయకులు కూడా ఆందోళన చెయ్యటం, రాజీనామాలతో బెదిరించటం, పార్టీ వీడిపోతామని చెప్పటమే కాకుండా చేసి చూపించటం చేసారు.  అయితే ఇలా పకడ్బందీగా అనుమతులతో చెయ్యటం ఇదే మొదటిసారి. 

కాకపోతే, పార్టీ విధానానికి పార్టీ సభ్యులే వ్యతిరేకంగా దీక్షలు చెయ్యటానికి పార్టీ అనుమతి కూడా ఉందా అని అనుమానాన్ని పలువురు వ్యక్తం చేస్తున్నారు.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles