Aap wearing party caps objected by bjp

BJP objects AAP caps in Assembly, AAP to prove strenght in Assembly, Sisodia moves confidence motion, Manish Sisodia,

AAP wearing party caps objected by BJP

ఢిల్లీ అసెంబ్లీలో టోపీలపై గలాటా

Posted: 01/02/2014 02:35 PM IST
Aap wearing party caps objected by bjp

ఈరోజు ఢిల్లీ శాసన సభలో ఆప్ టోపీల మీద గలాటా జరిగింది.  ఆమ్ ఆద్మీ పార్టీ తలలకు ధరించే తెల్లటోపీలను భాజపా శాసన సభ్యులు వ్యతిరేకించారు.  ఆమ్ ఆద్మీ పార్టీ శాసనసభ్యులు ఆ విధంగా టోపీలను ధరించి రావటం మీద భారతీయ జనతా పార్టీ తీవ్రంగా స్పందిస్తూ ఆ విధంగా ప్రత్యేకతను చాటుకోవటాన్ని తప్పుపట్టారు.

సభకు ముందు, విశ్వాస పరీక్షకు తమ పార్టీ సిద్ధమేనని, అందుకు భయపడేది లేదని ఆప్ అధినేత అరవింద్ కేజ్రివాల్ అన్నారు. మాకే గనక భయమనేది వుంటే మేము గుడిపోయి దండం పెట్టుకుని వచ్చుండేవాళ్ళమని కేజ్రివాల్ నవ్వుతూ అన్నారు. 

ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున మాట్లాడుతూ మనీష్ సిసోడియా, ఆమ్ ఆద్మీ పార్టీ చేసిన వాగ్దానాలకు కట్టుబడివుందని, నీరు విద్యత్ మాత్రమే కాకుండా ఢిల్లీలో ఇంకా ఎన్నో వసతులను మెరుగుపరుస్తామని చెప్తూ ఢిల్లీలో పాఠశాలల్లోనూ హాస్పిటల్స్ లోనూ సిఫారసులు లేకుండా చేర్చుకునే విధానాన్ని అమలుపరుస్తామని అన్నారు. 

విశ్వాస ప్రతిపాదనను శాసనసభలో ప్రవేశపెట్టిన సిసోడియా వ్యక్తిగత విషయాలను పక్కన పెట్టి ఢిల్లీ ప్రజలకోసం కదలిరావాలని శాసనసభలో పిలుపునిచ్చారు.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles