Minister sridharababu ready to resign

Minister Sridharababu ready to resign, Sridharabab Assembly Affairs ministry, Kiran Kumar Reddy, Minsiter Sailajanath Assembly Affairs, Assembly Affairs Ministry to Sailajanath, Telangana bill in Assembly

Minister Sridharababu ready to resign

శ్రీధరబాబు మంత్రి పదవికి రాజీనామా?

Posted: 01/02/2014 09:39 AM IST
Minister sridharababu ready to resign

నూతన సంవత్సరంలో నూతన రాష్ట్ర ఏర్పాటు జరుగుతుందని గంపెడాశతో ఉన్న తెలంగాణా వాదులకు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మంత్రి శ్రీధరబాబు నుంచి శాసన సభ వ్యవహారాల శాఖనుంచి తప్పించటం అశనిపాతమైందని తెలంగాణా నాయకులంతా వాపోతున్నారు. 

ముఖ్యమంత్రి తీసుకున్న చర్యను ఖండించటమే కాక ఆయన మీద విమర్శలను గుప్పిస్తున్నారు.  మంత్రి శ్రీధరబాబు రాజీనామాకు సిద్ధమయ్యారు.  ఓపిక పట్టమని ఎవరెంత చెప్పినా ఆయన మాత్రం తనకి మిగిలిన పౌర సరఫరాల శాఖను కూడా వదిలిపెట్టెయ్యటానికే మొగ్గుచూపిస్తున్నారు. 

ముఖ్యమంత్రి మీద వెల్లువెత్తిన ఫిర్యాదుల దృష్ట్యా మంత్రిత్వ శాఖలను ఎందుక బదిలీ చెయ్యవలసి వచ్చిందన్న విషయాన్ని పరిశీలిస్తామంటూ దిగ్విజయ్ సింగ్ హామీ ఇచ్చారు. 

ముఖ్యంగా తెలంగాణా మంత్రి శ్రీధరబాబుని తప్పించి సమైక్యాంధ్రకే పూర్తి మద్దతునిచ్చే మంత్రి శైలజానాథ్ ని కీలకమైన తెలంగాణా బిల్లు మీద చర్చ జరగవలసిన సందర్భంలో శాసన సభ వ్యవహారాలను అప్పగించటం పార్టీకి అతీతంగా అందరు తెలంగాణా నాయకులనుంచి కిరణ్ కుమార్ మీద విమర్శుల వెల్లువలా వస్తున్నాయి. 
తెలంగాణా జెఏసి నాయకులు ముఖ్యమంత్రి క్యాంప్ ఆఫీస్ ని ముట్టడించే ప్రయత్నం చెయ్యగా పోలీసులు వాళ్ళని అరెస్ట్ చేసారు. 

శ్రీధరబాబు మాత్రం రాజీనామా పత్రాన్ని తయారు చేసుకుని దాన్ని గవర్నర్ కి సమర్పించటానికి సిద్ధమైవున్నారు.  కొత్త సంవత్సరంలో కిరణ్ కుమార్ వ్యవహరించిన తీరు శ్రీధరబాబుని తీవ్ర మనస్తాపానికి గురిచేసిందంటూ ఆయన సన్నిహితులు చెప్తున్నారు. 

ఈ వ్యవహారం మీద కొత్తగా శాసన సభ వ్యవహారాల బాధ్యతలను చేపట్టిన శైలజానాధ్ మాత్రం ఏమీ వ్యాఖ్యానించటం లేదు. 

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles