Cm kiran understands the last ball digvijay

Digvijay Singh, CM, Kiran Kumar Samaikyandhra, Telangana, Seemandhra, , kiran,last ball,telangana

Kiran is a Cricketer, he understands the last ball. We are committed to create separate state of Telangana.

చివరి బంతి సంగతి ఆయనకు తెలుసు ?

Posted: 12/27/2013 08:45 AM IST
Cm kiran understands the last ball digvijay

కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ దిగ్విజయ్ సింగ్ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని ఉద్దేశించి ఓ ఆసక్తికరమైన వ్యాఖ్యచేశారు. ముఖ్యమంత్రి తెలంగాణ విషయంలో చివరిబంతి వరకు పోరాడతానని చేసిన వ్యాఖ్యల పై దిగ్గీరాజాను విలేఖర్ల ప్రశ్నకు... క్రికెట్ భాషలోనే సమాధానం చెప్పారు.

కిరణ్ కి మంచి క్రికెటర్ కదా ఆయనకు చివరి బంతి ఎప్పుడు పడుతుందో తెలుసునని... అందుకే చివరి బంతి వరకు పోరాడతానని అని ఉండవచ్చని అన్నారు. డిగ్గీ రాజా వ్యాఖ్యల్ని కాస్తంత లోతుగా పరిశీలిస్తే... ఈ బిల్లు వ్యవహారం తేలేలోగా రాజీపడకపోతే, కాంగ్రెస్ తో ఆయనకు అనుబంధం తెగినట్లే అనే సందేశాన్ని ఇచ్చారు. కిరణ్ కొత్త పార్టీ పెడతారా అని అడిగితే... ఆయన్నే అడగండి అని కాస్తంత చిరాగ్గా చెప్పాడు.

గతంలో కిరణ్ ని వెనకేసుకొని వచ్చే డిగ్గీరాజా ఇప్పుడు ఇలా మాట్లాడం పై సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ అధిష్టానం చెప్పిన మాట వినకపోతే కిరణ్ ని పక్కన పెట్టాని అధిష్టానం భావిస్తున్నట్లుగా అనుకోవాలి. దానికి కిరణ్ కూడా సిద్దపడుతున్నాడేమో అనిపిస్తుందని అంటున్నారు. మొత్తానికి చివరి బంతి ఎప్పుడు... ఎక్కడ వేయాలో అధిష్టానానికి, ఎప్పుడు పడుతుందో కిరణ్ కి తెలిసే ఉందన్న మాట.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles