Aap to form govt in delhi

Kejriwal CM Delhi, AAP form government, Kejriwal Congress, Kejriwal to be Delhi CM, Arvind Kejriwal, Aam Aadmi Party, Kejriwal next CM Delhi, Congress partner Kejriwal.

Arvind Kejriwal to be Delhi Chief Minister.

ఢిల్లీ గద్దె ఎక్కటానికి సిద్ధమైన కేజ్రీవాల్

Posted: 12/23/2013 12:42 PM IST
Aap to form govt in delhi

చిట్టచివరకు ఉత్కంఠకు తెరదించుతూ, ఆమ్ ఆద్మీ పార్టీ అధ్యక్షుడు అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ పీఠాన్ని అధిరోహించటానికి సంసిద్ధతను తెలియజేసారు.

 

ఈరోజు ఢిల్లీ లెఫ్టెనెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ ని కలవనున్న కేజ్రీవాల్ ఢిల్లీలో ప్రభుత్వాన్ని నెలకొల్పటానికి అంగీకారాన్ని తెలియజేయటానికి సిద్ధమయ్యారు. మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ కేజ్రీవాల్ తాను ఆ విషయంలో ప్రజాభిప్రాయాన్ని తీసుకున్నానని, ప్రభుత్వాన్ని ఏర్పాటు చెయ్యటానికి తనని ఎన్నుకున్న ప్రజలు మద్దతు ప్రకటించారని తెలియజేసారు.

 

ఈ ప్రకటన మీద స్పందించిన మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కేజ్రీవాల్ నిర్ణయం సరైనదేనని, దాన్ని స్వాగతిస్తున్నామని చెప్తూ, ఇదేవిధంగా ఆమ్ ఆద్మీ పార్టీ ప్రజలకు చేసిన వాగ్దానాలను పూర్తి చేస్తారనే ఆశాభావాన్ని కూడా వ్యక్తపరచారు.

 

అయితే భారతీయ జనతా పార్టీ నాయకుడు హర్షవర్ధన్ మాత్రం అందుకు వ్యతిరేకంగా, ఆమ్ ఆద్మీ పార్టీ ప్రజలను మోసగిస్తోందని అన్నారు. కాంగ్రెస్ తో కలవటమనేది ఆమ్ ఆద్మీ పార్టీకి సరైనది కాదని తద్వారా ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీ ప్రజానీకాన్ని మోసగించినట్లేనని ఆయన అన్నారు.

 

 

గవర్నర్ అంగీకరించినట్లయితే కేజ్రీవాల్ ఢిల్లీ జంతర్ మంతర్ దగ్గర శపథ స్వీకారం చేస్తారు.

 

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles