తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ సైన్యం మళ్లీ రంగంలోకి దిగింది. టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసిఆర్ మళ్లీ పంజా విసురుతున్నాడు. కేంద్రం చేసే జిమ్మిక్కులపై అసంత్రుప్తి చెందిన కేసిఆర్ తన సైన్యాన్ని మళ్లీ రంగంలోకి దించారు. దీంతో హైదరాబాద్ నగరంలో మళ్లీ ఉద్యమ సెగలు రేగుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం తలపెడుతున్న రాయల తెలంగాణ ప్రతిపాదనకు నిరసనగా ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు ఒక్కసారిగా ఆందోళనకు దిగారు. దీంతో వర్సిటీలోని ఎన్ సీసీ గేటు వద్ద ఈరోజు మధ్యాహ్నం తీవ్ర ఉద్రిక్త పరిస్థితి ఏరప్డింది. విద్యార్థులు భారీ సంఖ్యలో చేరుకోవడంతో వారిని అడ్డుకునేందుకు పోలీసులు ప్రయత్నించారు.
అయితే విద్యార్థులు జెండాలు పట్టుకుని నినాదాలు చేసుకుంటూ బారికేడ్ల మీద నుంచి దూకి బయటకు వెళ్లే ప్రయత్నాలు చేశారు. అలాగే విద్యార్థులు ప్రారంభించిన బైకు ర్యాలీని కూడా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులు, విద్యార్థులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోట చేసుకుంది. అక్కడి పరిస్థితి ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసులు ఓయూ వద్ద భారీగా మోహరించారు.
రాయల తెలంగాణ ఏర్పాటుపై కేంద్రం సుముఖంగా ఉన్నట్లు వార్తలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో విద్యార్థులు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు గురువారం తెలంగాణ బంద్ కు కూడా టీఆర్ఎస్ పిలుపునిచ్చింది. ఇది ఇంకెంత ఉద్రిక్తంగా మారుతుందోనని ఆందోళన వ్యక్తం అవుతోంది. ఓయూలో ఆందోళన సందర్భంగా విద్యార్థులు కొన్ని డ్రమ్ములకు నిప్పంటించి వాటిని కూడా విసిరేసిన ఘటనలు కనిపించాయి.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more