Farmer use speakers of the craft lands

farmer use speakers of the craft lands, forest pigs, farmers, crafts,

farmer use speakers of the craft lands

పందులను తరిమికొట్టే 'స్పీకర్‌'!

Posted: 11/27/2013 11:48 AM IST
Farmer use speakers of the craft lands

ఇప్పటి వరకు మనం అసెంబ్లీ, పార్లమెంట్ , రాజ్యసభ, లోక్ సభలలో , మన నాయకుల్ని అదుపు చేసే స్పీకర్లను చూసాం. కానీ ఇక నుండి రైతులకు ఉపయోగపడే స్పీకర్ ను మనం చూస్తాం. ఈ స్పీకర్ వల్ల మన రైతులు రాత్రి పూట హాయిగా ఇంట్లో నిద్రపోతారు. అంటే ఈ స్పీకర్ మాత్రం పందులను తరిమికొట్టే పనిలో బీజీగా ఉంటారు. అసలు విషయం ఏమిటంటే.. అడవి పందుల బెడదతో రైతులు పెద్దెత్తున నష్టపోతున్నారు. వాటిని అరికట్టేందుకు రైతులు నానా అవస్థలు పడుతున్నారు. కొందరు పొలం చుట్టూ ప్రహరీలను నిర్మిస్తే.. మరికొందరు ఫెన్సింగ్‌ వేసుకుంటున్నారు..ఇక చిన్నసన్నకారు రైతులు పంటల చుట్టూ బట్టలు కట్టి పంటలను కాపాడుకుంటు న్నారు. ఇలా రకరకాల ప్రయోగాలు చేస్తున్నా అడవి పందుల బెడదను మాత్రం పూర్తిగా అరికట్టలేకపోతున్నారు. ప్రతిఏటా పంట పొలాలకు అడవి పందుల బాధ అధికమవుతూ వస్తోంది.

 

భారత వ్యవసాయ పరిశోధనా మండలి(ఐసిఏఆర్‌) నివేదిక ప్రకారం రైతులు సాగుచేస్తున్న వివిధ పంటనలు జంతువులు(ఎలుకలు, అడవి పందు లు) ఎక్కువగా నాశనం చేస్తున్నాయి. వరి, మొక్కజొన్న, జొన్న, చెరుకు, వేరుశనగ తదితర పంటలను అడవి పందులు ఎక్కువగా నాశనం చేస్తున్నాయి. వన్యప్రాణి సంరక్షణ చట్టం ప్రకారం అడవి పందులను చంపడం నేరం కావడంతో రైతులు వాటిని ఎలా నిలువరించాలో తెలియక తీవ్రంగా నష్టపోతున్నారు. సరిగ్గా ఇలాంటి సమయంలోనే ఆచార్య ఎన్‌జి రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం గొప్ప ముందడుగు వేసింది. అడవి పందులను అరికట్టేందుకు చేసిన పరిశోధనలు ఫలించాయి. కొత్తగా రూపొందించిన స్పీకర్ అనే పరికరాన్ని వారం రోజులుగా రంగారెడ్డి జిల్లా తాండూరు సమీపం లోని ఆచార్య ఎన్‌జి రంగా వ్యవసాయ పరిశోధనా స్థానంలో చేపట్టిన ప్రయోగం వంద శాతం విజయవంతమైంది.

 

ఇది భారత వ్యవసాయ రంగంలో గొప్ప ముందడుగా రూపకర్త డాక్టర్‌ వాసుదేవరావు తెలిపారు. ఆచార్య ఎన్‌జి రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయంలోని పక్షి శాస్త్ర విభాగం అధిపతి, ప్రధాన శాస్త్రవేత్తగా డాక్టర్‌ వాసుదేవరావు పనిచేస్తున్నారు. ఐసిఏఆర్‌ ఇటీవల పబ్లిక్‌, ప్రైవేటు ప్రాజెక్టు(పిపిపి) కింద కర్ణాటకలోని బెంగళూరుకు చెందిన వయా లైఫ్‌ సైన్సెన్స్‌ అనే ప్రైవేటు సంస్థతో కలిసి పంట పొలాల్లో పక్షులు, జంతువుల బెడదను అరికట్టేందుకు పరిశోధనలు ప్రారంభించింది. తాండూరులోని వ్యవసాయ పరిశోధన స్థానం ఈ పరిశోధనలకు సహకారం అందజేసింది.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles