Bjp breaks telangana bill in parliament

BJP breaks Telangana Bill in Parliament, elangana Bill to Parliament Dec 10, Telangana Bill, Parliament

BJP breaks Telangana Bill in Parliament, elangana Bill to Parliament Dec 10, Telangana Bill, Parliament

డిసెంబర్ 10న టి. బిల్లును బీజేపీ రానీయదా ?

Posted: 11/23/2013 09:25 AM IST
Bjp breaks telangana bill in parliament

తెలంగాణ రాష్ట విభజన ప్రక్రియకు సంబంధించిన ముసాయిదా బిల్లు డిసెంబర్ పదవ తేదీన పార్లమెంటులో పెట్టేందుకు కాంగ్రెస్ అధిష్టానం వేగంగా పావులు కదుపుతున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే కోర్ కమిటీ భేటీలు, జీఎంఓ సమావేశాలు నిర్వహిస్తోంది. నిన్న సాయంత్రం హైదరాబాద్‌ను ఏం చేయాలనే విషయంపై కాంగ్రెసు కోర్ కమిటీ సమావేశం గంటన్నరకు పైగా జరిపింది. ఈ సమావేశానికి ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ అధ్యక్షత వహించారు.

ఈ సమావేశంలో సోనియా గాంధీతో పాటు ఆమె రాజకీయ సలహాదారు అహ్మద్ పటేల్, కేంద్ర మంత్రులు చిదంబరం, ఎకె ఆంటోనీ, సుశీల్ కుమార్ షిండే తదితరులు పాల్గొన్నారు. ఇరవై ఏడో తేదీన కేంద్ర మంత్రుల బృందం మరోసారి సమావేశం అయి నివేదికను ఖరారు చేస్తుంది. ఆ తర్వాత రోజు క్యాబినెట్ లో పెడతారు. తదనంతరం రాష్ట్రపతి ద్వారా శాసనసభకు పంపుతారు.

అనంతరం పార్లమెంటు ప్రవేశపెడతారని చెబుతున్నా.... ఈ బిల్లుకు బీజేపీ అభ్యంతరం చెప్పవచ్చని అంటున్నారు. ఎందుకంటే తెలంగాణ పై కాంగ్రెస్ ప్రకటన చేసిన తరువాత అనేక అంశాలు తెరపైకి వచ్చాయి. ముఖ్యంగా హైదరాబాద్, భద్రాచలం వంటి అంశాల పై బీజేపీ ఎప్పుకోక పోతే డిసెంబర్ 10వ తేదీన పార్లమెంటుకు బిల్లు రాదనే వార్తలు వినిపిస్తున్నాయి.

మరి ఇన్ని రోజులు తెలంగాణకు మద్దతు ఇస్తాం అని చెప్పిన బీజేపీ వల్ల బిల్లు ఆగిపోతే ఆ పార్టీకి తీవ్ర నష్టం తప్పదని విశ్లేషకులు అంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles