Trs mla ktr fire on cm kiran rachabanda

trs mla ktr fire on cm kiran rachabanda, CM Kiran Rachabanda 3 Schedule, telangana congress leaders, congress party, trs party, trs mla ktr, rachaabanda

trs mla ktr fire on cm kiran rachabanda

కిరణ్ బొమ్మ వద్దు..

Posted: 11/16/2013 10:11 AM IST
Trs mla ktr fire on cm kiran rachabanda

విశాఖ జిల్లాలో జరిగిన రచ్చబండలో ముఖ్యమంత్రి కిరణ్‌ కుమార్‌రెడ్డి అధికార దుర్వినియోగానికి పాల్ప డ్డారని తెలంగాణ రాష్ట్ర సమితి ఆరోపించింది. సమైక్య సభ పెట్టుకోవాలని ముఖ్యమంత్రి భావిస్తున్నట్లయితే, పదవికి రాజీనామా చేసి సభలు నిర్వహించుకోవాలని తెరాస ఎమ్మెల్యే కల్వకుంట్ల తారక రామారావు సూచించారు.

 

సంక్షేమ పథకాల పేరుతో జరుపుతున్న రచ్చబండ కార్యక్రమాన్ని సీఎం కిరణ్‌ సమైక్యసభలాగా చేస్తున్నారని విమర్శించారు. నిత్యం అబద్ధాలు చెబుతూ సీమాంధ్ర ప్రజలను మోసం చేస్తున్నారని, తెలంగాణను ప్రయోగశాలగా ఉపయోగించు కుంటున్నారని ధ్వజమెత్తారు. 1953లో మద్రాసు రాష్ట్రం నుండి విడిపోవాలని ఆనాడు వారు చేసింది ఆత్మగౌరవ పోరాటమని అంటూ, ఇపుడు తెలంగాణ ప్రజలు అవే కారణాలతో విడిపోతా మంటే మాత్రం ఇది విభజన వాదమంటారా అని ప్రశ్నించారు.

 

తన జిల్లాకు చెందిన ఇద్దరు మంత్రులను ఐక్యంగా ఉంచలేని సీఎం రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచుతానని చెప్పడం ప్రగల్భాలే నన్నారు. రాష్ట్రం విడిపోతే వచ్చే సమస్యలను జీవోఎం చూసుకుంటుందని తెలిపారు. తెలంగాణలో సిఎం ఫ్లెక్సీలు, బొమ్మలు లేకుండా రచ్చబండ నిర్వహించే బాధ్యతను తెలంగాణ మంత్రులు తీసుకోవాలన్నారు.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles