Man accuses mla wife of beating him up

Man accuses MLA wife of beating him up, Samajwadi Party MLA, Man accuses MLA wife of beating him up

Man accuses MLA wife of beating him up, Man accuses MLA wife of beating him up

సొంత భర్తను చితకబాదిన మహిళ ఎమ్మెల్యే

Posted: 11/09/2013 04:46 PM IST
Man accuses mla wife of beating him up

ఇప్పటి వరకు భార్య ను భర్త చితకబాదటం మనం వినే ఉంటాం. అక్కడక్కడ మాత్రం ఇందుకు విరుద్దంగా జరుగుతుంటుంది. కానీ రాజకీయ హోదాలో ఉన్న మహిళ నాయకురాలు సొంత భర్తను చితకబాదినట్లు అతి తక్కువుగా వింటాం. ఇప్పుడు అలాంటిదే జరిగింది. ఉత్తరప్రదేశ్ లో జరిగింది. ఉత్తరప్రదేశ్ లో అధికార సమాజ్ వాదీ పార్టీ మహిళా ఎమ్మెల్యే తన భర్తపై దాడి చేశారు. తన అంగరక్షకులతో కలసి భర్తను చితకబాదినట్టు పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది.

 

చాండౌసి ఎమ్మెల్యే లక్ష్మీ గౌతమ్ విభేదాల కారణంగా భర్త దిలీప్ వర్ష్ నెకు దూరంగా ఉంటున్నారు. లక్ష్మి తన గన్ మన్, ఇతర సహాయకులతో కలసి తన ఇంటికి వచ్చి తనపై దాడి చేసినట్టు దిలీప్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వృద్ధురాలైన తన తల్లిని దూషించడంతో పాటు ఇంటిని ఖాలీ చేయాల్సిందిగా తనను హెచ్చరించినట్టు ఆరోపించారు. భార్య కొడితే పర్వలేదు గానీ తన గన్ మన్ ల చేత కూడా కొట్టించిందని భర్త దిలీప్ చెప్పినట్లు సమాచారం. ఈ కేసు పై పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకుంటారో చూడాలి.

 

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles