Telangana ministers boycott andhrapradesh formation day

telangana ministers boycott andhrapradesh formation day, andhrapradesh formation day, cm kiran kumar reddy, telangana issue, t-ministers,

telangana ministers boycott andhrapradesh formation day, andhrapradesh formation day

దూరం దూరం.. తెలంగాణ మంత్రులు

Posted: 11/01/2013 11:04 AM IST
Telangana ministers boycott andhrapradesh formation day

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ వేడుకలు హైదరాబాద్ లోని ఎన్టీఆర్ స్టేడియంలో ఘనంగా జరుగుతున్నాయి. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి జెండా ఎగురవేసి గౌరవ వందనం స్వీకరించారు. మంత్రులు గంటా శ్రీనివాసరావు, రఘువీరారెడ్డి, టీజీ వెంకటేష్, శాసనమండలి ఛైర్మన్ చక్రపాణి, ఎమ్మెల్సీ రుద్రరాజు పద్మరాజు తదితరులు పాల్గొన్నారు. కాగా రాష్ట్ర విజభన నేపథ్యంలో అంధ్రప్రదేశ్ ఆవతరణ వేడుకలను తెలంగాణవాదులు అడ్డుకునే అవకాశం ఉందనే అనుమానంతో పోలీసు ఉన్నతాధికారులు భారీ భద్రత ఏర్పాట్లు చేశారు.

 

అందులోభాగంగా ఎన్టీఆర్ స్టేడియం పరిసర ప్రాంతాల్లో భారీగా పోలీసులు మోహరించారు. రాష్ట్ర సచివాలయం నుంచి ఇందిరా పార్క్ వైపు వచ్చే తెలుగు తల్లి ఫ్లై ఓవర్ ను భద్రత చర్యల్లో భాగంగా మూసివేశారు. రాష్ట్ర మంత్రులతోపాటు పలువురు ఉన్నతాధికారులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు.

 

ఆంధ్రప్రదేశ్‌ అవతరణ దినోత్సవం వేడుకలకు తెలంగాణ మంత్రులు దూరంగా ఉన్నారు. దాంతో తెలంగాణ జిల్లాల్లో మంత్రులకు బదులు కలెక్టర్లే జెండా ఆవిష్కరించనున్నారు. ఈ మేరకు ప్రభుత్వమే ఉత్తర్వులు ఇచ్చిన విషయం తెలిసిందే. మరోవైపు ఆంధ్రప్రదేశ్ అవతరణ దినం సందర్భంగా నవంబర్ 1న తెలంగాణవ్యాప్తంగా విద్రోహదినాన్ని పాటించాలని టీ జేఏసీ పిలుపునిచ్చింది. తెలంగాణలోని గ్రామస్థాయి వరకు నిరసనర్యాలీలు నిర్వహించాలని సూచించింది.

 

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles