Central home minister shinde meeting on bifurcation

Central Home Minister Shinde Meeting on Bifurcation, home minister Sushilkumar Shinde, seemandhra congress leaders, governor narasimhan , congress party, ap bifurcation,

Central Home Minister Shinde Meeting on Bifurcation

షిండే కీలక సమావేశం..

Posted: 10/25/2013 03:08 PM IST
Central home minister shinde meeting on bifurcation

రాష్ట్ర గవర్నర్, సీమాంద్ర నేతలు.. ఢిల్లీలో బీజీ బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఇలాంటి సందర్భంలో రాష్ట్ర విభజనపై షిండే కీలక సమావేశం ఏర్పాటు చేస్తున్నట్లు సమాచారం. ఇంత సడన్ గా .. షిండే కీలక సమావేశవ ఏర్పాటు చేయటంతో.. సీమాంద్ర కాంగ్రెస్ నేతల్లోను, తెలంగాణ కాంగ్రెస్ నేతల్లోను అలజడి మొదలైంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనపై ఈరోజు సాయంత్రం 4.30 గంటలకు కేంద్ర హోం శాఖ కీలక సమావేశం జరుగనుంది. కేంద్ర హోం శాఖ కార్యదర్శి అధ్యక్షతన జరిగే ఈ సమావేశానికి ఇతర మంత్రిత్వ శాఖలు హాజరు కానున్నాయి. ఈ సమావేశంలో అనుసరించాల్సిన విధి విధానాలపై చర్చించనున్నారు.

 

శీతాకాల సమావేశాలకంటే ముందే మంత్రుల బృందం తన నివేదికను అందచేస్తుందని కేంద్ర హోం మంత్రి షిండే పేర్కొన్నారు. రాష్ట్ర గవర్నర్ నరసింహన్ ఢిల్లీలోనే ఉన్నారు. ఆయన అధిష్టానం పెద్దలతో చర్చలు జరిపారు. కేవలం మర్యాదపూర్వకంగానే కలుస్తున్నట్లు గవర్నర్ పేర్కొంటున్నా రాష్ట్ర విభజన అంశంపై ఆయన నివేదికను అందచేసినట్లు ప్రచారం జరుగుతోంది.

 

ఇప్పటికే హోం శాఖ అధికారులతో గవర్నర్ చర్చించారు. అనంతరం ఈ రోజు జరిగే కేంద్ర హోం శాఖ సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ సమావేశంలో ఏం చర్చిస్తారు.. రాష్ట్ర విభజన పై ఏం ప్రకటన చేస్తారోనని అందరు ఆశక్తిగా ఎదురుచూస్తున్నారు.

 

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles