Trs executive committee to meet on oct 25

No merger, trs alliance with Congress, trs latest strategy, TRS president K Chandrasekhar Rao

The Telangana Rashtra Samiti (TRS) state executive plans to meet here on October 25 to discuss its future course of action.

పొత్తా...విలీనమా ? 25 తరువాత తేలుస్తాం

Posted: 10/21/2013 09:30 AM IST
Trs executive committee to meet on oct 25

గత దశాబ్ద కాలానికి పైగా ప్రత్యేక రాష్ట్ర డిమాండ్ తో పోరాడుతున్న టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర సాధన విషయంలో విజయం అంచు వరకు వచ్చింది. గత కొన్నేళ్ళుగా ప్రజల్ని చైతన్యవంతం చేస్తూ... ప్రత్యేక నినాదంతో ప్రజల్లోకి చొచ్చుకొని పోయిన టీఆర్ఎస్ గతంలో ఆ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేస్తే పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేస్తానని ప్రకటించారు. ఇటీవల కాంగ్రెస్ అధిష్టానం తెలంగాణ కు అనుకూలంగా నిర్ణయం తీసుకున్న తరువాత టీఆర్ఎస్ విలీనం పై చర్చకు తెరలేసింది. విభజన నిర్ణయం వెల్లడించిన సమయంలో షిండే కూడా టీఆర్ఎస్ విలీనం అంశాన్ని గుర్తుచేశారు.

కానీ గత రెండు నెలల నుండి టీఆర్ఎస్ పార్టీ విలీనం మాటే ఎత్తకుండా స్తబ్దుగా ఉండిపోయింది. ఈ మధ్య కాలంలో టీఆర్ఎస్ పార్టీ నాయకులు కాంగ్రెస్ లో విలీనం ఉండదనే సంకేతాలు ఇచ్చారు. తెలంగాణ బిల్లును ఆసల్యం చేస్తుండటంతో ఆ పార్టీ కాంగ్రెస్ పై మెల్లిమెల్లిగా స్వరాన్ని పెంచుతూ ఉంది. పార్టీ నాయకుల్లో చాలా మంది భవిష్యత్తులో రాజకీయ మనుగడ సాగించాలంటే పార్టీని విలీనం చేయకూడదని, గతంలో లాగే కాంగ్రెస్ తో పొత్తు మాత్రమే పెట్టుకుంటే బాగుంటుందనే అభిప్రాయాన్ని వెల్లడించడంతో అధినేత కేసీఆర్ కూడా ఆ దిశగా ఆలోచనలు సాగిస్తున్నట్లు తెలుస్తుంది.

దాంతోపాటు పార్టీ కార్యక్రమాలు, కార్యాచరణను నిర్ణయించుకునేందుకు అక్టోబర్ 25న పార్టీ రాష్ట్ర కార్యవర్గం సమావేశం కానుందని ఈ సమావేశానికి పార్టీ అధినేతతో పాటు ముఖ్యనాయకులు కూడా హాజరు కానున్నట్లు టీఆర్ఎస్ భవన్ వర్గాలు తెలిపాయి. ఈ సమావేశం తరువాత కాంగ్రెస్ లో విలీనమా ? పొత్తా అనే దాని పై స్పష్టత రానుంది. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles